Home /News /telangana /

TS POLITICS CONGRESS PARTY ANNOUNCED INCHARGES FOR MANDAL WISE REGARDING MUNUGODU BY ELECTIONS AK

Munugodu| Congress: ‘మునుగోడు’ మండలాలకు కాంగ్రెస్ ఇంఛార్జ్‌లు వీరే.. కీలక బాధ్యతలు

రేవంత్ రెడ్డి​, మునుగోడు (ఫైల్​)

రేవంత్ రెడ్డి​, మునుగోడు (ఫైల్​)

Munugodu: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. పార్టీ తరపున టికెట్ ఆశించే వారి జాబితాలో పలువరు ఓసీలు, పలువురు బీసీలు ఉండటంతో.. టికెట్ ఏ వర్గానికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడు ఉప ఎన్నికను మండలాల వారీగా ఇంఛార్జ్‌లను నియమించింది కాంగ్రెస్(Congress) పార్టీ. చౌటుప్పల్(Choutuppal)  మండలానికి మాజీమంత్రి దామోదర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మునుగోడుకు(Munugodu) సీతక్క, విజయరమణారావు, నాంపల్లికి అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, గట్టుప్పల్‌కు సంపత్, ఆది శ్రీనివాస్, చండూర్... ఇరవత్రి అనిల్, వంశీకృష్ణ, మర్రిగూడకి చెరుకు సుధాకర్, వేం నరేందర్ రెడ్డిలను ఇంఛార్జ్‌లుగా నియమించింది. మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో.. ఈ సీటును గెలుచుకోవడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

    తెలంగాణలో(Telangana ) కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ విజయం లేకపోవడం.. ఓ వైపు బీజేపీ దూకుడుగా విజయాలు సాధిస్తుండటం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. అందుకే మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఉప ఎన్నికకు తాము సిద్ధమని రేవంత్ రెడ్డ ప్రకటించారు. కొద్దిరోజుల క్రితమే మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు... ఈ నియోజకవర్గంలో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.



    ఈ క్రమంలో నియోజకవర్గంలోని మండలాలవారీగా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌లను ప్రకటించింది. అయితే మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. పార్టీ తరపున టికెట్ ఆశించే వారి జాబితాలో పలువరు ఓసీలు, పలువురు బీసీలు ఉండటంతో.. టికెట్ ఏ వర్గానికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ఇక్కడి టికెట్‌ను బీసీ వర్గానికి చెందిన నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో.. కాంగ్రెస్ నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠగా మారింది.

    Independence Day 2022 : గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన కేసీఆర్..7ఏళ్లలో తెలంగాణ రాబడి 3రెట్లు పెంచామన్న సీఎం

    Revanth reddy: ‘‘మునుగోడు ప్రజలకు మోసం చేయడానికి ఆయన బయలుదేరారు’’: రేవంత్​ రెడ్డి

    మరోవైపు అభ్యర్థి ఎంపిక వరకు ఆగకుండా కాంగ్రెస్‌కు ఓటు వేయాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్‌కు ఓటు వేసేలా జనాన్ని ఒప్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం జరిగినా.. పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ రకంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుని మండలాల వారీగా ఇంఛార్జ్‌లను నియమించింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు