Home /News /telangana /

TS POLITICS CONGRESS MP KOMATIREDDY VENKAT REDDY DEMANDS APOLOGY FROM REVANTH REDDY FOR HIS COMMENTS ON KOMATIREDDY RAJAGOPAL REDDY BROTHERS AK

Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్.. కాంగ్రెస్‌లో మొదలైన పంచాయతీ

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

TS Politics: తమ బ్రదర్స్ ఇద్దరినీ కలిపి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టి వెంకట్ రెడ్డి.. వెంటనే ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

    మునుగోడులో కాంగ్రెస్ నేతలంతా కలిసి ఐక్యంగా కాంగ్రెస్, బీజేపీలపై పోరాటం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించి 24 గంటలు గడవకు ముందే ఆ పార్టీలో కొత్త పంచాయతీ మొదలైంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్ బ్రాండ్ లేకుంటే బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లు అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తీవ్రంగా మండిపడ్డారు. తమ బ్రదర్స్ ఇద్దరినీ కలిపి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టి వెంకట్ రెడ్డి.. వెంటనే ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శించాలని అనుకుంటే.. ఆయన పేరు తీసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress) కోసం తాను 35 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ నిజాయితీతో ఉన్న వాళ్లమే అని అన్నారు.

    రేవంత్ రెడ్డి అనవసరంగా తనను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి తనకు ఇష్టం ఉన్న పార్టీలో వెళ్లారని.. వెళుతూ వెళుతూ రాజీనామా చేసి వెళ్లారని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారా ? అని ప్రశ్నించారు. తన మీద మాట పడితే పడనని అన్నారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో తాను స్పందించబోనని అన్నారు. తాము చదువుకున్న తరువాత సొంతంగా కాంట్రాక్టులు చేసుకుని పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదని అన్నారు.



    రేవంత్ రెడ్డి తనను కూడా కించపరిచేలా మీరు అని అనడం తప్పని.. ఆ విషయంలో ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలని భావిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన సోదరుడి పార్టీ మార్పుపై పెద్దగా స్పందించని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏ మేరకు కృషి చేస్తారన్నది కూడా సందేహంగానే మారింది.

    Munugode Bypoll : మునుగోడుకు భారీగా నిధులు.. అమల్లోకి CM KCR హామీలు.. కోమటిరెడ్డి కోరిందే?

    Telangana: టీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా ?.. ఆ మాజీమంత్రి మాటలకు అర్థమేంటి ?

    మరో రెండు రోజుల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారా ? లేదా ? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉంటే.. ఆయన పరోక్షంగా ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి సహకరించినట్టే అవుతుందని రేవంత్ రెడ్డి వర్గం ఆరోపించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరు కాంగ్రెస్, మరొకరు బీజేపీలోకి వెళ్లడం కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చేలా కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Komatireddy rajagopal reddy, Revanth Reddy, Telangana

    తదుపరి వార్తలు