టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) మండిపడ్డారు. సొంత పార్టీ నేతలు తిట్టిన బాధలోనే తాను వెళ్లడం లేదని అన్నారు. విదేశీ పర్యటన పూర్తిగా తన వ్యక్తిగతమని అన్నారు. తనపై కేటీఆర్(KTR) చేసిన కోవర్ట్ కామెంట్స్ విత్‌డ్రా చేసుకోవాలని అన్నారు. తెలంగాణ(Telangana) కోసం మంత్రి పదవి వదులుకున్న తనను కోవర్ట్ అనే అర్హత కేటీఆర్‌కు ఉందా ? అని అన్నారు. కేటీఆర్ వంద దేశాలు తిరిగి ఏం చేశారో తనకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక్క ఎంపీ కూడా పార్టీ మారరని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నల్లగొండ జిల్లా కోసం ఏమీ చేయలేదని అన్నారు. నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను టీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని అన్నారు.
తాను మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరి తరపున పోటీ చేయడం లేదని.. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని అన్నారు. అంతకుముందు కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోవర్ట్ బ్రదర్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరారరని.. మరొకరు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారట అని సెటైర్లు వేశారు. ఎలక్షన్ ముగిసిన తర్వాత తిరిగి వస్తారట అని ఎద్దేవా చేశారు.
అన్న కాంగ్రెస్ ఎంపీ, తమ్ముడు బీజేపీ అభ్యర్థి అని పేర్కొన్నారు. వీరిద్దరూ కోమటిరెడ్డిలు కాదు.. కోవర్ట్ రెడ్డిలు అని విమర్శించారు. కోవర్ట్ ఆపరేషన్లు చేసేటోళ్లు అని కామెంట్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుట్టలో వేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుందని కేటీఆర్ గుర్తుచేశారు. పథకాన్ని దేశం మొత్తం అమలు చేయాలని కేంద్రానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రెండు వారాల గడువు..
మునుగోడులో కలకలం..కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన దుండగులు..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం
మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. అయినా పట్టించుకోలేదని ఫైరయ్యారు. ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు ప్రజల కోసం రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని కోరితే మోదీకి మనసు ఒప్పలేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని విమర్శలు చేశారు. రాష్ట్రం కన్నా వ్యక్తే ముఖ్యం అని అర్థం అవుతోందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy venkat reddy, KTR