TS POLITICS CONGRESS MP KOMATIREDDY VENKAT REDDY CLARIFIES THAT HE CONTEST FROM NALGONDA ASSEMBLY SEAT IN NEXT ELECTIONS AK
Komatireddy Venkat reddy: వచ్చే ఎన్నికల్లో పోటీపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ.. అది చాలు అని వ్యాఖ్య..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Telangana: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో నిలిచే అవకాశం ఉన్న నాయకుల్లో ఒకరిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తనకు సీఎం పదవి వద్దని కామెంట్ చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న అనేకమంది నేతలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ జాబితాలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. గత లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసిన గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy VenkatReddy).. అందుకుముందుకు అనేకసార్లు నల్లగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన భూపాల్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కొన్ని నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.
తన పోటీ విషయంలో కాంగ్రెస్ నాయకత్వానిదే నిర్ణయమంటూ చెబుతూ వచ్చారు వెంకట్ రెడ్డి. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ(Nalgonda) కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఆలేరు లేదా భువనగిరి నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా ఈ ఊహాగానాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని.. నల్లగొండ ఎమ్మెల్యేగా ఉంటే చాలు అని వ్యాఖ్యానించారు.
తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో నిరాశ చెందారు. రేవంత్ రెడ్డితో(Revanth Reddy) అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతో ఆయన కొంతవరకు శాంతించారు.
అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో నిలిచే అవకాశం ఉన్న నాయకుల్లో ఒకరిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తనకు సీఎం పదవి వద్దని కామెంట్ చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మరోసారి తన సొంత నియోజకవర్గమైన నల్లగొండ అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇకపై నల్లగొండ అసెంబ్లీ స్థానం మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.