Home /News /telangana /

TS POLITICS CONGRESS MP KOMATI REDDY VENKATREDDY RESPONDED TO THE COMMENTS OF BANDI SANJAY WHO COMMENTED THAT HE IS IN FAVOR OF BJP PRV

Komatireddy Venkatreddy| Bandi sanjay: బీజేపీకి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మద్దతుందన్న బండి సంజయ్​.. స్పందించిన కోమటిరెడ్డి.. ఏమన్నారంటే..?

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, బండి సంజయ్​ (ఫైల్​)

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, బండి సంజయ్​ (ఫైల్​)

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా మాకు టచ్లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, మోడీకి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మద్దతుగా మాట్లాడరని తెలిపారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి స్పందించారు.

    మునుగోడులో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati reddy rajagopal reddy) కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడు నియోజక వర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Chief Bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బీజేపీనే గెలుస్తుందని కుండబద్దలు కొట్టారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా మాకు టచ్లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, మోడీకి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అనుకూలంగా మాట్లాడరని తెలిపారు. అంతే కాకుండా తెలంగాణలోని (Telangana) పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రానున్నాయని అన్నారు. అలాగే చీకోటి వ్యవహారంలో టీఆర్ఎస్ (TRS) నేతల ముఖ్య పాత్ర ఉంది. కానీ, డ్రగ్స్ కేసులాగే దీన్ని నిరుగార్చేలా చేస్తున్నారంటూ మండి పడ్డారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పాదయాత్ర చేస్తోన్న బండి సంజయ్.. జిల్లాలో పాదయాత్ర ముగిసే సమయానికి పెను ప్రకంపణలు సృష్టించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు.

    అయితే తాను కూడా బీజేపీకి మద్దతుగా ఉన్నానని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati reddy venkatreddy) స్పందించారు.  బండి సంజయ్ ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. బండి సంజయ్ తో తాను టచ్ లో లేనని చెప్పారు. బండి సంజయ్ (Bandi sanjay) మాట్లాడిన విషయాలను తాను చూడలేదన్నారు. బండి సంజయ్ ఏం మాట్లాడారో చూడకుండా తాను ఏం మాట్లాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.



    Ideal Village: గ్రామపంచాయితీలకు బంఫర్​ ఆఫర్​..  అలా చేస్తే కోటి రూపాయల నజరానా.. 

    బండి సంజయ్ తోనే కాదు బీజేపీకి చెందిన ఎవరితోనూ కూడా తాను టచ్ లో లేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రధాని మోడీని కలిసిన ఉద్దేశ్యం గురించి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. తన నియోజకవర్గంలో జాతీయ రహదారుల అంశంతో పాటు బొగ్గు గనుల టెండర్ల విషయంలో చోటు చేసుకొన్న అవినీతి విషయంలో ప్రధానిని కలిసినట్టుగా చెప్పారు.మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పారు.

    GI: మన హైదరాబాద్ లక్క గాజులు, తాండూర్​ పప్పుకు భౌగోళిక గుర్తింపు..?

    కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎలాంటి విబేధాలు లేవన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో జరిగే పరిణామాలపై తాను దృష్టి కేంద్రీకరించినట్టుగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, తన నియోజకవర్గానికి నిధుల విషయమై తాను పోరాటం చేస్తున్నట్టుగా చెప్పారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bandi sanjay, Komatireddy venkat reddy, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు