హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన నిర్ణయం.. వివరాలివే

Munugodu: ప్రియాంక గాంధీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన నిర్ణయం.. వివరాలివే

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్​)

కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన  కాంగ్రెస్ (Congress) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆమెతో అనేక అంశాలపై చర్చించానని ఇంతకుముందే అన్నారు. తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

    తెలంగాణలోని (Telangana) ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి)కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరు కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలే అయినా.. జిల్లా వ్యాప్తంగా వీరికి అనుచరగణం ఉంది. ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ అనుచరగణాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) ప్రత్యేకత. అందుకే టీఆర్ఎస్ (TRS) హవా బలంగా వీచిన సమయంలోనూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఎమ్మెల్సీగా నిలబడి విజయం సాధించారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy Venkat Reddy) భువనగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించడం వెనుక ఇది కూడా ఒక కారణం. అయితే రాజగోపాల్​ రెడ్డి బీజేపీలోకి చేరడంతో తెలంగాణ రాజకీయాలు హాట్​హాట్​గా మారాయి. మరికొద్దిరోజుల్లో ఉప ఎన్నిక సైతం రానుంది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ తరఫున కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రచారంలో పాల్గొంటారా? లేదా అనేది కార్యకర్తల మదిలో ఉండిపోయింది. దీనికికోమటిరెడ్డి నేడు చెక్​ పెట్టారు.


    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Congress MP Komati Reddy Venkat Reddy) మునుగోడు (Munugodu) ప్రచారానికి సిద్ధమయ్యారు. ఎప్పుడూ ఆదేశించినా ప్రచారానికి వెళ్తానని ఎంపీ స్పష్టం చేశారు. భట్టి విక్రమార్కతో అభ్యర్ధి ఎంపికపై చర్చించామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సోనియా, ప్రియాంక నిర్ణయం మేరకే అభ్యర్ధి ఎంపిక వుంటుందని కూడా వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.


    కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమైన  కాంగ్రెస్ (Congress) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆమెతో అనేక అంశాలపై చర్చించానని ఇంతకుముందే అన్నారు. తాను ప్రియాంకకు అనేక విషయాలు చెప్పానని.. ఆమె కూడా తనకు పలు సూచనలు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. తామిద్దరి మధ్య భేటీ 40 నిమిషాలు పాటు సాగిందని వెల్లడించారు. ఈ భేటీ ఫలప్రదంగా జరిగిందని వివరించారు. ఈ భేటీలో ఏం జరిగిందనే విషయాలను తాను చెప్పబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) విదేశాలకు వెళ్లి వచ్చిన తరువాత రాబోయే ఎన్నికలపై రూపొందించే యాక్షన్ ప్లాన్‌పై చర్చిద్దామని చెప్పినట్టు తెలిపారు. పార్టీలో ఏ సమస్య ఉన్నా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దగ్గరకు వచ్చి చెప్పాలని ప్రియాంక సూచించినట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.


    Politics: పెళ్లిళ్లే ‘‘రాజకీయ వేదికలు’’.. బడా నేతల ఇళ్లల్లో మోగిపోతున్న బాజాలు


    ప్రియాంకతో జరిగిన సమావేశం అంశాలను బయటకు వివరించలేనని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్గొనే అంశం సహా తెలంగాణకు సంబంధించిన ఏ ఇతర అంశాలపై స్పందించేందుకు నిరాకరించారు. తాజాగా నేడు భట్టీతో సమావేశం అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టంచేశారు.


    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Komatireddy venkat reddy, Munugodu By Election, Priyanka Gandhi

    ఉత్తమ కథలు