తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడిన తరువాత ఎంఐఎం శాసనసభాపక్ష నేత అసదుద్దీన్ ఓవైసీతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యే సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడారు. అరగంటకుపైగా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అకర్బరుద్దీన్‌తో ఏం చర్చించారనే దానిపై ఆసక్తి నెలకొంది. తాము కేవలం పిచ్చాపాటిగా మాత్రమే మాట్లాడామని శ్రీధర్ బాబు చెప్పాగా.. సెక్యూలర్ అంటున్న అక్బరుద్దీన్ ఓవైసీతో చర్చలు జరిపితే తప్పేంటని జగ్గారెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akbaruddin owaisi, Congress, Telangana