హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: బీజేపీ బలిసినోళ్ల పార్టీ .. కాంగ్రెస్ పేదల కన్నీళ్లు తుడిచే పార్టీ : ఎమ్మెల్యే సీతక్క

Telangana Politics: బీజేపీ బలిసినోళ్ల పార్టీ .. కాంగ్రెస్ పేదల కన్నీళ్లు తుడిచే పార్టీ : ఎమ్మెల్యే సీతక్క

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

MLA Seethakka: దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయని బీజేపీకి కేంద్రంలో ఉండే నైతిక హక్కు లేదని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రతి వస్తువు ధరలు పెంచి , ధనవంతులకు దోచిపెడుతున్న బీజేపీ డబ్బున్నొళ్ల పార్టీ అని కాంగ్రెస్ పేద ప్రజల కన్నీళ్లు తుడిచే పార్టీ అన్నారామె.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ(Telangana)లో తమ స్వరం వినిపించడానికి...ఓటర్ల హృదయాల్లో చోటు సంపాధించడానికి కాంగ్రెస్(Congress)నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్‌(TRS)ని కొన్ని సందర్బాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP)ని మరికొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఎండగడుతున్నారు ఆపార్టీ నేతలు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(MLA Sitakka)బీజేపీ నాయకులపై చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిగ్‌గా మారాయి.

Telangana : ఆదర్శ కాలేజీలోని 10మంది అమ్మాయిలకు ట్రీట్‌మెంట్ .. అసలు ఏం జరిగిందో తెలుసా ..?


బీజేపీ బలిసినోళ్ల పార్టీ : సీతక్క

నిత్యవసర సరుకుల ధరలతో పాటు జీఎస్టీ, గ్యాస్‌, పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచుతూ పోతున్న బీజేపీ పేదల పార్టీ కాదని బలిసినోళ్ల పార్టీ అంటూ విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. గడిచిన ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమి లేదని ధ్వజమెత్తారామె. ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేసి అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను కూలగట్టడం తప్ప ఏం చేయలేదన్నారు. చివరకు కమలం పార్టీ నాయకులు శ్రీరాముడ్ని కూడా బీజేపీకి ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకునేందుకు దేవుడ్ని కూడా రాజకీయల్లోకి లాగుతున్నారని విమర్శించారు. అయోధ్య రామమందిరం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కన్నీళ్లు తుడితే పార్టీ అని చెప్పుకొచ్చారామె.

రాముడ్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు..

ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో తెలంగాణలో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్‌ ఏకంగా బీజేపీని విమర్శిస్తూ లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, దేశ ప్రజలపై బీజేపీ ప్రభుత్వం మోపుతున్న అధిక ధరల భారంపై పోరాడుతూ హైదరాబాద్‌ ధర్నాచౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈవేదికపైనే ములుగు ఎమ్మెల్యే సీతక్క బీజేపీపై ఓ రేంజ్‌లో విమర్శనస్త్రాలు సంధించారు. అగ్నిపథ్ పేరుతో సైనికులను అవమానించిన బీజేపీ పాలకులు ఉపాధి హమీ చట్టం వంటి సంక్షేమ పథకం తెచ్చిన సోనియాగాంధీని ఈడీ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు.

దేశ ప్రజలకు చేసిందేమి లేదు..

భారత స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర ఏమిటో చెప్పాలంటూ ప్రశ్నించారు సీతక్క. కాంగ్రెస్‌ ముక్త్ భారత్‌ అంటున్న బీజేపీ నేతలు .. వాళ్లకు, దేశానికి ఏం అన్యాయం చేసిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సావర్కర్‌ లాంటి వాళ్లే బ్రిటీష్ వాళ్లను పట్టుకొని దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ వేదికపై ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్‌లో గెలిచిన నాయకులు, అగ్రస్థాయి నేతలంతా మెల్లిగా జారిపోతున్నారు. అయితే వాళ్లకు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ వల వేస్తుండటంతో కాంగ్రెస్‌ నేతలు ఈవిధంగా ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అక్కడే బీజేపీ తీరును ఎండగడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First published:

Tags: Bjp, Congress mla, MLA seethakka, Telangana Politics

ఉత్తమ కథలు