Home /News /telangana /

TS POLITICS CONGRESS MLA SEETHAKKA MISTAKENLY VOTED FOR NDA CANDIDATE DRAUPADI MURMU IN THE PRESIDENTIAL ELECTION SNR

President election | Telangana : ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ..యాధృచ్చికమేనా..?

(FILE PHOTO)

(FILE PHOTO)

Seethakka : రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పొరపాటుపడ్డారు. ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో విపక్షాల అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హాకు ఓటు వేయకుండా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు తన ఓటు వేశారు. యాధృచ్చికంగా జరిగిన ఈసంఘటనపై ఓ గిరిజన మహిళ ప్రెసిడెంట్‌ అయ్యేందుకు గిరిజన ఎమ్మెల్యే ఓటు వేశారంటూ రాజకీయంగా చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
రాష్ట్రపతి ఎన్నిక(President Election)ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) సీతక్క(Seethakka) తన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అయితే ఓటు వేసే క్రమంలో ఆమె పొరపాటు చేశారు. విపక్షాల అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా(Yashwant Sinha)కు ఓటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ తీర్మానించింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఆదే విధంగా తమ ఓటు వేశారు. ములుగు(Mulugu) ఎమ్మెల్యే సీతక్క మాత్రం ఎన్డీఏ(NDA) బలపర్చిన అభ్యర్ధి ద్రౌపది ముర్ము(Draupadi Murmu)కు ఓటు(Vote) వేశారు.

President Election 2022: 5PM వరకు పోలింగ్.. క్రాస్ ఓటింగ్‌కు బీజేపీ యత్నం..



ఎమ్మెల్యే సీతక్క పొరపాటు..
రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పొరపాటున ఎన్టీఏ బలపర్చిన ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లుగా ఎమ్మెల్యే సీతక్క గుర్తించారు. జరిగిన పొరపాటును వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సీతక్క. అంతే కాదు తిరిగి మరోసారి ఓటు వేసే అకాశం కల్పించాలని బ్యాలెట్ పత్రం కోసం ఎన్నికల అధికారుల్ని అసెంబ్లీ హాలులో రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే సీతక్క పొరపాటుపై ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఓటు వేసిన అనంతరం అసెంబ్లీ హాలు వెలుపలికి వచ్చిన ఎమ్మెల్యే సీతక్క ఈ విషయాన్ని వెల్లడించారు.

యాధృచ్చికంగా..

తెలంగాణ అసెంబ్లీ హాలులో జరిగిన ఈ కీలక పరిణామంపై టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్‌లో యాధృచ్చికంగా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకి ఓటు వేసినప్పటికి రాజకీయ వర్గాల్లో మాత్రం ఎన్డీఏ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్ది గిరిజన మహిళ కావడమే కాకుండా పొరపాటున ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా గిరిజనురాలు కావడం విశేషంగా చెప్పుకుంటారు. తెలిసో తెలియకో ఓ దళిత ఎమ్మెల్యే మరో దళిత మహిళ దేశ రాష్ట్రపతి కావడానికి ఓటు వేయడం గొప్ప విషయంగానే చూస్తున్నారు.

ఆత్మసాక్షిగా ఓటు వేశా ..
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారనే వార్త కలకలం రేపింది. విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు కాకుండా పొరపాటున ఆమె ముర్ముకు ఓటేశారంటూ జరిగిన ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీతక్క క్లారిటీ ఇచ్చారు. ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేశానని అయితే ఆ గీత వల్ల ఏదైనా సమస్య కారణంగా ఓటు చెల్లదేమోననే ఆలోచనతోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Congress mla, President Elections 2022

తదుపరి వార్తలు