తెలంగాణ కాంగ్రెస్కు రాహుల్ గాంధీ పర్యటనతో కొంతమేర ఉత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనలతో ముందుకు సాగాలని ఆ పార్టీ నేతలు శ్రేణులకు సూచిస్తున్నారు. ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలందరూ పార్టీ లైన్లోనే ఉన్నా.. ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ నుంచి దూరం దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ(Telangana) పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉండిపోయారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాం రాం చెప్పినట్టే అనే చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ వైపు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నట్టు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
అయితే ఇప్పుడు బీజేపీలో చేరే విషయంలోనూ ఆయన పూర్తి క్లారిటీతో లేరని తెలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో (Komatireddy Rajagopal Reddy) భేటీ అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీలో చేరే విషయంలో తొందరపడొద్దని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి సూచించారని.. తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం ఉందని ఆయన చెప్పినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీలో చేరే విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేశారని పలువురు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ దళిత బంధు, ఈటల రాజేందర్" width="1200" height="800" class="size-full wp-image-968906" /> కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
అయితే చాలాకాలం నుంచి బీజేపీలో చేరే దిశగా ఆలోచిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మదిలో కొత్త పార్టీ ఆలోచన ఏంటనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. బీజేపీలో చేరే విషయంలో ఆయన సమయం తీసుకుంటున్నారా ? లేక ఆయన చేరికకు బీజేపీ నేతలే బ్రేకులు వేస్తున్నారా ? అన్నది విషయంలోనూ స్పష్టత లేదు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అన్న, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) మాత్రం తన తమ్ముడి ఆలోచనతో పూర్తిగా విభేదించినట్టు అర్థమవుతోంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆ లైన్లోనే వెళతారా ?.. తాము అనుకున్నట్టు చేస్తారా ?.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
Bandi Sanjay: బండి సంజయ్కు టీఆర్ఎస్ ఆ విధంగా షాక్ ఇచ్చిందా ?.. ముందస్తు ప్లాన్ ?
రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లినా తనకు సంబంధం లేదని.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమని వెంకట్ రెడ్డి అన్నారు. దీంతో రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్ ఒంటరి అయిపోయారనే చర్చ కూడా సాగుతోంది. అయితే త్వరలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన ఉండటంతో.. ఆయన పర్యటన నాటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయంలో ఏమైనా స్పష్టత రావొచ్చనే చర్చ సాగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.