కాంగ్రెస్ నాయకుడు (Congress leader), ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhhi) సభ (Warangal meeting)కు దూరంగా ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) నిర్ణయం తీసుకొన్నారు. కొంత కాలంగా పార్టీ నాయకత్వం తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే రాహుల్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లకూడదని నిర్ణయం తీసుకొన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ నాయకత్వం తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరుతానని కూడా గతంలో ప్రకటించారు. బీజేపీలో చేరే విషయమై ఆ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో సంభాషణ కూడా గతంలో వైరల్ గా మారింది. అప్పట్లో పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏ మేరకు శాంత పరుస్తాడో..
అయితే ఇలా సడెన్గా బహిరంగ సభకు డుమ్మా కొట్టాలనుకోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్య క్తం చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే పార్టీ సీనియర నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని బుజ్జగించిన రేవంత్ తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని ఏ మేరకు శాంత పరుస్తాడో చూడాల్సి ఉంది.
ఇక రాహుల్ టూర్ విషయానికొస్తే.. రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో Hyderabad శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 5:10కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ (Warangal) బయలుదేరుతారు. 5:45 గంటల వరకు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు. తదుపరి సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ (Farmers Sangharshana Meeting)లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 8:00 గంటలకు రాహుల్ గాంధీ వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో బస చేస్తారు రాహుల్..
7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:30కి రాహుల్ గాంధీ హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. 12:50 నుంచి 1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ కార్యక్రమం అనంతరం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy rajagopal reddy, Rahul Gandhi, Revanth Reddy, TS Congress, Warangal