హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana | Politics: రేవంత్‌రెడ్డితో మళ్లీ జగడానికి జగ్గారెడ్డి రెడీ .. అసలు కారణం అదేనా..!

Telangana | Politics: రేవంత్‌రెడ్డితో మళ్లీ జగడానికి జగ్గారెడ్డి రెడీ .. అసలు కారణం అదేనా..!

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana | Politics: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్‌పై మళ్లీ ఫైర్ అయ్యారు. వీహెచ్‌ని తిట్టారనే సాకును అడ్డుపెట్టుకొని ఆయన ఓ రేంజ్‌లో రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసలు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ పదవికి పనికి రాడన్నారు. అతని వ్యవహారంపై హైకమాండ్‌కి లేఖ రాస్తానని హెచ్చరించడం వెనుక మతలబు ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...

తెలంగాణ (Telangana)కాంగ్రెస్‌ నేతల మధ్య మళ్లీ మాటల యుద్ధం ముదిరిపాకాన పడుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్‌లో చేరికలు, ఆధిపత్య ప్రదర్శనలతో లోలోపల కుమిలిపోయిన నాయకులు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హాYashwant Sinha రాకను అడ్డుపెట్టుకొని మాటల దాడికి దిగారు. గతంలో కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy), సంగారెడ్డి(Sangareddy)ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy)మధ్య టగ్‌ ఆఫ్ వార్‌ జరిగింది. మళ్లీ ఇప్పుడు సేమ్‌ సీని రిపీట్ అవుతోంది. యశ్వంత్‌ సిన్హాను కాంగ్రెస్‌ పార్టీ నేతలు కలవద్దనే టీపీసీసీ చీఫ్‌ ఆదేశాలు ధిక్కరించారని వీ.హనుమంతరావు(Hanumantha Rao).అందుకు బదులుగానే రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటంపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

రేవంత్‌తో జగ్గారెడ్డి జగడం..

పార్టీలో 70ఏళ్ల నుంచి ఉంటున్న వ్యక్తిని నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్‌రెడ్డి ఎలా అమర్యాదగా మాట్లాడతారంటూ తగులుకున్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌రెడ్డి ఏమైనా కొన్నాడా లేక కాంగ్రెస్ నేతలు ఏమైనా ఆయన బంట్రోతులా అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పార్టీలో సీఎల్పీ ప్రమోయం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పీసీసీ పోస్ట్‌ని చిల్లర పోస్ట్‌గా మార్చారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వెళ్లగక్కారు జగ్గారెడ్డి. రేవంత్‌రెడ్డి కెపాటిటీ ఏంటో తనకు తెలుసన్న సంగారెడ్డి ఎమ్మెల్యే వీహెచ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తగ్గేదేలే..

వీహెచ్‌ని రేవంత్‌రెడ్డి తిట్టిన విషయంలో జగ్గారెడ్డి మాత్రమే ఎందుకింతలా స్పందించారని కాంగ్రెస్‌ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఆదివారం ఉదయం 9గంటలకు జగ్గారెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయం వరకు అక్కడే ఉంటారు. అదే సమయంలో జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన బీజేపీ అగ్రనాయకులు సైతం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. బీజేపీ నాయకులు వెళ్లే టైమ్‌లో జగ్గారెడ్డి కూడా వెళ్లడంపై టీపీసీసీ చీఫ్ అభ్యంతరం వ్యక్తం చేస్తారనే ముందు చూపుతోనే జగ్గారెడ్డి రేవంత్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగినట్లుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇది చదవండి: తెలంగాణలో ఈడీ ప్రకంపనలు ..అధికార పార్టీ ఎంపీ నాామా ఆస్తులు జప్తుహస్తవాసి బాగుందా లేదా ..

రాష్ట్రంలో ప్రధాన పార్టీల నేతలు ప్రత్యర్ధులతో పోరాడుతుంటే ...తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం సొంత పార్టీ నేతలతోనే ఒకరితో మరొకరు పొట్లాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు పరుషపదజాలంతో కౌంటర్‌లు ఇచ్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. హస్తం గుర్తు పార్టీలో సిస్ట్యూవేషన్ ఇంకా ఏ స్థాయికి చేరుకుంటుందోననే ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

ఇది చదవండి: కేటీఆర్ మాటలపై విశ్వబ్రాహ్మణులు గరం ..సారీ చెప్పకపోతే బాగోదంటూ వార్నింగ్


First published:

Tags: Jagga Reddy, Revanth Reddy, Telangana Politics

ఉత్తమ కథలు