హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jaggareddy: ఆ కారణంతోనే అర్హులు కూడా పెన్షన్‌కి దూరం .. 3,016రూపాయల పెంచి ఇచ్చేదెప్పుడు : జగ్గారెడ్డి

Jaggareddy: ఆ కారణంతోనే అర్హులు కూడా పెన్షన్‌కి దూరం .. 3,016రూపాయల పెంచి ఇచ్చేదెప్పుడు : జగ్గారెడ్డి

Jaggareddy ,Kcr (file)

Jaggareddy ,Kcr (file)

Jaggareddy: టీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని మర్చిపోయిందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడే అవసరం లేకుండా పెన్షన్‌ విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయసు పైబడిన వాళ్లు, నిరక్షరాస్యులకు ఫించన్‌ల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

టీఆర్ఎస్‌(TRS)పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని మర్చిపోయిందని విమర్శించారు కాంగ్రెస్(Congress)ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy). వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడే అవసరం లేకుండా పెన్షన్‌(Pension)విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయసు పైబడిన వాళ్లు, నిరక్షరాస్యులకు ఫించన్‌ల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. బర్త్ సర్టిఫికెట్లు (Birth certificates)లేని కారణంగా కేవలం ఆధార్‌ కార్డు(Aadhaar card)ల ఆధారంగా ఫించన్ ఇస్తుండటం వల్ల అర్హులైన చాలా మందికి ఫించన్‌ అందకుండా పోతోందన్నారు.ఈవిషయంలో ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వృద్ధుల వయోపరిమితికి సంబంధించిన డిటెయిల్స్‌ మార్చి వీఆర్ఏలతో సరి చేయించాలని కోరారు. ప్రభుత్వం ఇస్తామని చెప్పినట్లుగా 3016పెన్షన్ ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

KCR National Party: బీజేపీ వ్యతిరేక కూటమి భేటీకి TRS​ చీఫ్​ కేసీఆర్​ డుమ్మా..! అసలేం జరుగుతోంది?

ఫించన్ అందుకోని అర్హులు..

ఎన్నికలు, ఉపఎన్నికల వేళ పార్టీలు చేస్తున్న వాగ్ధానాలు, ప్రజలకు ఇస్తున్న హామీలు ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ముఖ్యంగా తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయసు మళ్లిన వాళ్లంతా ఫించన్ పొందుతున్న వారితో పాటు మరికొంత మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి తెలిపారు. బర్త్ సర్టిఫికెట్లు లేని కారణంగా 65 నుండి 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ల వయసు ఆధార్‌ కార్డలలో 55, లేదా 60 లోపు ఉన్నట్లుగా చూపిస్తోందన్నారు. ఆ కారణంగానే రాష్ట్రంలో అనేక మంది ఫించన్‌కు అర్హత పొందలేకపోతున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వమే సరిచేయాలి..

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈవిషయంపై దృష్టి పెట్టాలని జగ్గారెడ్డి కోరారు. వీఆర్‌ఏలతో ఇంటింటి సర్వే నిర్వహించి ఆధార్‌ కార్డు డేటాను మార్చాలని కోరారు. ప్రతి మున్సిపాలిటీలోని వార్డులో, గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అద్దార్ కార్డు లో వయసు తక్కువ, తప్పుగా వచ్చినవారికి ప్రభుత్వమే సవరణ చేసేల చర్యలు తీసుకోవాలన్నారు. ఆవిధంగా చేస్తే వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారితో పాటు ఆర్ధిక ఇబ్బదులు పడుతున్న వాళ్లకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

Attendance by Caste: చదువుల తల్లి తలదించుకునే ఘటన.. ఆ స్కూల్ లో కులాలవారీగా పిల్లలకు అటెండెన్స్..

మాట నిలబెట్టుకోండి ..

అంతే కాదు 2018ఎన్నికల మేనిఫెస్టోలో అందరికి పెన్షన్ 3016 రూపాయలు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసారు సంగారెడ్డి ఎమ్మెల్యే. వాగ్ధానం ఇచ్చారు కాని ప్రస్తుతానికి 2016 రూపాయలే ఫించన్ ఇస్తున్నారని దాన్ని 3016 రూపాయలకు పెంచాలని కోరారు. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. అలాగే 57 ఏళ్లు పైబడిన వారందరికి 3016ఫించన్‌ను కూడా అమల్లోకి తేవాలన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రాజేక్టులు కడుతున్న ప్రభుత్వం..ముసలితనంలో ఇబ్బంది పడుతున్న భార్య,భర్తలిద్దరికి ఫించన్ ఇస్తే వాళ్లను ఆదుకున్న వాళ్లు అవుతారని ప్రభుత్వానికి తన విన్నపాన్ని తెలియజేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మరి జగ్గారెడ్డి అభ్యర్ధనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Jagga Reddy, Telangana Politics

ఉత్తమ కథలు