హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jaggareddy: YSR మరణించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అందుకోసమే స్కెచ్ వేసుకున్నారు : జగ్గారెడ్డి

Jaggareddy: YSR మరణించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అందుకోసమే స్కెచ్ వేసుకున్నారు : జగ్గారెడ్డి

JAGGAREEDDY ,SHARMILA

JAGGAREEDDY ,SHARMILA

Jaggareddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య డైలాగ్‌ వార్ పీక్స్‌కి చేరుకుంది. సంగారెడ్డిలో పాదయాత్ర చేస్తున్న షర్మిల ఆదివారం జగ్గారెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ఇది జరిగి 24గంటలు గడవక ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వైఎస్‌ షర్మిలను కడిగిపారేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నన్ను ఒకటి అంటే నిన్ను మూడు అంటా అనే చందంగా మారింది కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy), వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య డైలాగ్‌ వార్. జగ్గారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి(Sangareddy)లో పాదయాత్ర చేస్తున్న షర్మిల ఆదివారం(Sunday) ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. ఇది జరిగి 24గంటలు తిరగక ముందే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ జగ్గారెడ్డి వైఎస్‌ షర్మిలతో పాటు ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(ys jagan)ను, తల్లి విజయమ్మ(Vijayamma)తో పాటు తండ్రి వైఎస్ఆర్‌(YSR)ని ముగ్గురిపై ఘాటు విమర్శలు చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే నీకెందుకంటూ మొదలుపెట్టిన జగ్గారెడ్డి షర్మిలనే కాదు విజయమ్మ, జగన్ అంతా బీజేపీ (BJP)వదిలిన బాణాలేనంటూ బాంబ్ పేల్చారు. ఏపీలోని ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ(NTR Health University)పేరును వైఎస్ఆర్‌గా మార్చడం తప్పేనని ఖండించారు జగ్గారెడ్డి.

Sad news: ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు జలసమాధి ..ఎలా జరిగిందంటే..?

మీ తండ్రి పార్టీ మారలేదా..?

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఎస్‌ షర్మిలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆదివారం తనపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను వైఎస్ఆర్‌ వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చే కూతురు కాదని ...ఆయన్ని అభిమానించే వాళ్లతో తండ్రిని తిట్టించడానికే తెలంగాణలో పాదయాత్ర చేస్తోందని మండిపడ్డారు. తాను పార్టీలు మారుతానని చెప్పిన షర్మిల వ్యాఖ్యలను సమర్ధించుకున్న జగ్గారెడ్డి ..అందుకు కారణం మీ తండ్రి వైఎస్‌ఆరే అంటూ చురకలంటించారు. టీఆర్ఎస్‌లో ఉన్న తనను కాంగ్రెస్‌లోకి చేరమని ఆహ్వానించి ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది వైఎస్ఆర్‌ అనే విషయాన్ని గుర్తు చేశారు జగ్గారెడ్డి. గతంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్‌ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల ..ఇప్పుడు వైఎస్ఆర్‌ వదిలిన బాణాన్ని అనడం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. షర్మిలే కాదు జగన్, విజయమ్మ కూడా బీజేపీ వదిలిన బాణాలేనంటూ తీవ్రస్తాయిలో మండిపడ్డారు సంగారెడ్డి ఎమ్మెల్యే.

నన్ను ఒకటి అంటే నేను మూడంటా..

అంతటితో వదలకుండా ..వైఎస్ఆర్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానికి సంబంధించిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. వైఎస్ఆర్‌ చనిపోయిన సందర్భంలో తన లాంటి కార్యకర్తలు, నేతలు ఎంతో మంది బాధపడుతూ ఏడుస్తుంటే షర్మిలగానో బాధపడుతుంటే..ఇంట్లో వీళ్లంతా ఎవరు సీఎం అవ్వాలని స్కెచ్ వేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. నిజంగా వైఎస్ఆర్ అంటే కుటుంబ సభ్యులైన మీకంటే మా లాంటి వాళ్లకే ఎక్కువ అభిమానం ఉందంటూ కవర్ చేసుకున్నారు. పార్టీలు, రాజకీయ వ్యవహారాల్లో జగన్, షర్మిల వేరుగా ఉంటారు ...శ్రద్ధాంజలి, ఆస్తుల పంపకం విషయంలో ఇద్దరూ కలిసే ఉంటారని తీవ్ర ఆరోపణలు చేసారు.

Telangana politics : జాతీయ రహదారి చుట్టూ రాజకీయాలు .. కాంగ్రెస్,TRSనేతల మధ్య మాటల యుద్ధం

ముగ్గురు బీజేపీ వదిలిన బాణాలే..

ఇక పురాణాల్లోని రామాయణగాధను ఉదాహరిస్తూ షర్మిలను కోతిగా అభివర్ణించారు జగ్గారెడ్డి. తాను అభిమానించే వైఎస్‌ఆర్‌ను తనతోనే తిట్టిస్తున్నారని రామాంజనేయ యుద్ధం జరిగినట్లుగా రాముడుకి ఆంజనేయుడికి మధ్య యుద్ధానికి కారణమైన కోతిలా తయారయ్యారని షర్మిలపై ఫైర్ అయ్యారు. కేవలం హైదరాబాద్‌లోని ఏపి ప్రజల ఓటు బ్యాంక్ కాంగ్రెస్‌కి పోకుండా అడ్డుకునే పనిలో షర్మిల ఉన్నారని..ఖచ్చితంగా బీజేపీ వదిలిన బాణేమని మరోసారి కామెంట్ చేశారు జగ్గారెడ్డి. చివరగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కూడా ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ప్రజల్లో మంచి పేరున్న ఎన్టీఆర్ పేరు మార్చడం తప్పేనని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్షన్ స్టైల్లోనే ఉంటానంటే ఎట్లా అంటూ చురకలంటించారు. పదవులు శాశ్వతం కాదని ...పదవి నుంచి దిగిపోయిన తర్వాత తెలుస్తుందంటూ పరోక్షంగా ఏపీ సీఎం జగన్‌ని విమర్శించారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Jagga Reddy, Telangana Politics, YS Sharmila

ఉత్తమ కథలు