సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్‌లో ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మెట్రో లైన్ ప్రాజెక్ట్ పొడిగింపుపై సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి వినతిపత్రం అందించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపైనా సీఎం కేసీఆర్‌తో(KCR) జగ్గారెడ్డి (Jagga Reddy) చర్చించారు. సీఎం ఛాంబర్‌లో కేసీఆర్‌ను జగ్గారెడ్డి మరోసారి కలవనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపైనే సీఎంను కలిశానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తాను సీఎం కేసీఆర్‌ను చాటుగా కలవలేదని వెల్లడించారు. కాంగ్రెస్(Congress) ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పులేనప్పుడు ఎమ్మెల్యేగా సీఎంను కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వైఖరిని తప్పుబట్టే వారిలో జగ్గారెడ్డి ముందువరుసలో ఉంటారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన అనేకసార్లు తన అసంతృప్తిిని వెళ్లగక్కారు.
రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి సైతం అనేకసార్లు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు మిగతా పార్టీ సీనియర్ల తరహాలోనే జగ్గారెడ్డి కూడా దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్కతో కలిసి ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని కలిశారు. ఎంఐఎం పార్టీ సైతం సెక్యూలర్ అంటోందని.. వారిని కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన సీఎం కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓ వైపు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతున్న సమయంలోనే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. తాను కేవలం తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, సంగారెడ్డి వరకు మెట్రో పొడిగింపు అంశాన్ని మాత్రమే చర్చించానని జగ్గారెడ్డి చెబుతున్నా.. వీరి మధ్య రాజకీయాలకు సంబంధించి ఏ రకమైన చర్చ జరిగిందనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది.
TSRTC: పెళ్లిళ్ల సీజన్... టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..!
PM Modi: మరోసారి ట్రెండింగ్‌లో ప్రధాని మోదీ జాకెట్.. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారీ..
అయితే తనదైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే జగ్గారెడ్డి.. కేసీఆర్‌తో భేటీ అంశంపై కూడా త్వరలోనే స్పందిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ జరుగుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్‌ను కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Jagga Reddy, Telangana