TS POLITICS CONGRESS MLA JAGGA REDDY CONVINCED REGARDING REVANTH REDDY ISSUE AK
Jagga Reddy: మెత్తబడ్డ జగ్గారెడ్డి .. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందా ?.. ఇక్కడే సెటిలైందా ?
ఎమ్మెల్యే జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తాడని అనుకున్న జగ్గారెడ్డి కూల్ అవడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందా లేక స్థానిక నేతలే రంగంలోకి దిగి అంతా చక్కబెట్టారా ? అన్నది సస్పెన్సే.
ఈ రోజు సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించిన తెలంగాణకాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మళ్లీ మెత్తబడ్డారు. ముందుగా చెప్పినట్టుగా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి (Jagga Reddy).. సంచలన ప్రకటన జోలికి మాత్రం వెళ్లలేదు. బీజేపీ, టీఆర్ఎస్‌పై విమర్శలు చేసి తన ప్రెస్‌మీట్ ముగించారు. దీంతో జగ్గారెడ్డి మళ్లీ మెత్తబడిపోయారనే విషయం తేలిపోయింది. సంచలన ప్రకటన ఏమైందని మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించినా.. వాటి గురించి వద్దని చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) ఓ రేంజ్‌లో ఫైర్ అయిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ (Congress) పార్టీకి గుడ్ బై చెప్పాలని దాదాపుగా డిసైడ్ అయ్యారని అంతా అనుకున్నారు.
మరోవైపు జగ్గారెడ్డిపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారని.. హైకమాండ్ ఫిర్యాదు చేయడానికి ముందే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలని అనుకుంటున్నారనే చర్చ కూడా జరిగింది. కానీ సంచలన ప్రకటన చేసిన న్యూస్ మేకర్ అవుతారని భావించిన జగ్గారెడ్డి.. అలాంటిదేమీ లేదని చెప్పడంతో.. అసలేం జరిగిందనే దానిపై టాక్ మొదలైంది. జగ్గారెడ్డి అసంతృప్తితో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయ్యిందని.. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు ఫోన్ చేసి ఆయనను కన్విన్స్ చేశారని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తరువాత మాట్లాడదామని.. ఇప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ పెద్దలు జగ్గారెడ్డికి సూచించారని సమాచారం.
ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ రావడంతోనే జగ్గారెడ్డి ఈ విషయంలో సైలెంట్ అయ్యారని.. తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని పలువురు భావిస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డిని రాష్ట్రస్థాయిలోని కొందరు కీలక నేతలే బుజ్జగించారనే చర్చ కూడా సాగుతోంది. జగ్గారెడ్డి తొందరపడి నిర్ణయం తీసుకుంటే.. ఆ తరువాత పరిణామాలు వేగంగా మారిపోయే అవకాశం ఉందని.. రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి అంతా కలిసికట్టుగా ఉండాలని కొందరు నేతలు జగ్గారెడ్డికి సూచించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ నేతలంతా కలిసి కన్విన్స్ చేయడంతో రాష్ట్రస్థాయి నేతల బుజ్జగింపులతోనే జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తరువాత కాంగ్రెస్ నేతలు మళ్లీ కలిసి పని చేస్తారా ? లేక ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించి ఎవరి పని వాళ్లు చేసుకుంటారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ప్రకంపనలు సృష్టిస్తాడని అనుకున్న జగ్గారెడ్డి కూల్ అవడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందా లేక స్థానిక నేతలే రంగంలోకి దిగి అంతా చక్కబెట్టారా ? అన్నది సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.