తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత వ్యవహారం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. సీఎల్పీ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)భట్టి విక్రమార్క(Bhattivikramarka)..సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి కేంద్రాన్ని విమర్శించడం చర్చనీయాంశమైంది. విద్యుత్ సవరణ బిల్లుపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టిన భట్టీ విక్రమార్క...టీఆర్‌ఎస్(TRS) ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లుగా మాట్లాడారు. ట్యాక్సు(Tax)ల రూపంలో పేదలు కట్టే డబ్బును మోదీ(Modi) ప్రభుత్వం ఆయన సన్నిహితులైన ఒకరిద్దరికి కట్టబెడుతూ దేశ ప్రజల్ని తీవ్రంగా నష్టపరుస్తోందని విమర్శించారు.
భట్టి మాటలకు అర్దాలే వేరులే..
కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకులు నియంత పోకడంతో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. రాష్ట్రాల వాదనను, స్థానిక ప్రభుత్వాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మేం చెప్పిందే అమలు చేయాలనే విధంగా వ్యవహరించడం దారుణమని అసెంబ్లీలో చెప్పారు. వ్యవసాయ విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించడం ఎక్కడి నిర్ణయమని భట్టి తప్పు పట్టారు. ఇక విభజన చట్టం హామీలు, రాష్ట్రానికి కేటాయించిన నిధులు, అభివృద్ధి తాలుక అంశాలపై చర్చించకుండా ..కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ డీలర్ షాపులో మోదీ ఫోటో పెట్టలేదని కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై భట్టి వ్యంగ్యస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సభలో వ్యవహార శైలి చూస్తుంటే టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.
కేంద్రంపై సీఎల్పీ నేత ఫైర్ ..
కేంద్రంతో తాడో-పేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సిద్దపడింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ వెలుపల, లోపల బీజేపీ నిర్ణయాలు, తెలంగాణ పట్ల అనుసరిస్తున్న విధానంపై తీవ్రంగా ఖండించింది. ముందుగా మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మరోసారి చర్చకు తేవడం చూస్తుంటే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. భట్టీ విక్రమార్క టీఆర్‌ఎస్‌కి వంత పలకడం చూస్తుంటే సభలో సమస్యలపై లేవనెత్తకుండా సర్కారుకు జోడి కట్టడం ఏమిటనే సందేహాలు కలుగుతున్నాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ..తర్వాత ప్రజలకు చేసిన వాగ్ధానాలు...వాటి అమలుపై నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాల్లో ఈవిధంగా వ్యవహరించడం ఏమిటని రాజకీయ వాదులు ఆశ్చర్యపోతున్నారు. సభలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సీఎల్పీ నేత, సీనియర్ నాయకుడే ఇలా మాట్లాడటం చూసి సభలో ఉన్న మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం అవక్కైనట్లుగా కనిపించింది. అయితే బీజేపీ ప్రభుత్వంపై భట్టి చేసిన విమర్శలకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ వివరణ ఇచ్చారు. విద్యుత్ సవరణ బిల్లులో ఎక్కడా వ్యవసాయ విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టాలనే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ఎవరికైనా సందేహాలు ఉంటే సీఎం కేసీఆరే సభలో వివరణ ఇవ్వాలని కోరారు రఘనందన్‌రావు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhatti Vikramarka, Telangana Assembly, Telangana Politics