ఓ వైపు బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఎన్నడూ లేని విధంగా ఫోకస్ చేసి వరుస పర్యటనలు చేస్తుండటంతో.. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే గత నెలలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరై.. రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై నేతలకు దిశానిర్ధేశం చేశారు. రాహుల్ గాంధీ వచ్చి వెళ్లిన తరువాత బీజేపీ ఢిల్లీ పెద్దలు అనేకసార్లు తెలంగాణలో పర్యటించి వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీని(Rahul Gandhi) మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. వచ్చే నెలలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి కేటీఆర్ (KTR) సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో(Siricilla) భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించింది.
ఈ సభకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ వరుస సభలు పెడుతుండటంతో.. వారికి ధీటుగా తాము కూడా సభలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో తెలంగాణలో మరిన్ని సభలు ఉండేలా ప్లాన్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా ప్రజల్లోకి వెళుతుందనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులు, ప్రజల్లో కల్పించాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ తరహాలోనే పెరేడ్ గ్రౌండ్స్‌లోనే సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు అనుకున్నప్పటికీ.. ఈ సభ అధికార పార్టీని టార్గెట్ చేసే విధంగా ఉండాలంటే మరో ప్రాంతంలో సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సిరిసిల్లను భారీ సభను ఏర్పాటు చేయడం ద్వారా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసే విధంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నట్టు సమాచారం. వరంగల్ సభను మించి సిరిసిల్ల సభను సక్సెస్ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
Telangana: తెలంగాణలో మరో 3 రోజుల పాటు కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Dalitha Bandhu: దళిత బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమ్మలేరు.. కొనలేరు..
అయితే సభను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖనేత రాహుల్ గాంధీ వీలును బట్టి ఆగస్టులో ఏదో ఒక రోజు బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉన్న టీపీసీసీ.. దీనిపై జులై చివరి వారంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ దూకుడుకు ధీటుగా కాంగ్రెస్ కూడా సభలు, సమావేశాలతో తెలంగాణలో జోరు పెంచాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, KTR, Rahul Gandhi, Siricilla, Telangana