Home /News /telangana /

TS POLITICS CONGRESS LEADERS EXPRESSING THEIR UNHAPPINESS BJP IS THE REASON BEHIND ACCORDING TO POLITICAL CIRCLES AK

BJP| Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు పెరుగుతున్న కష్టాలు.. బీజేపీ వ్యూహంలో భాగమేనా ?

ఈటల, రేవంత్​ (ఫైల్​)

ఈటల, రేవంత్​ (ఫైల్​)

Telangana| BJP: తెలంగాణలో చేరికలను ప్రొత్సహించేందుకు బీజేపీలో ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తెర వెనుక మంత్రాంగం నడిపిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీరుకు వ్యతిరేకంగా అనేక మంది నేతలు గళమెత్తుతున్నారు. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వంటి నేతలు అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి లేఖలు కూడా రాస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఈ అంశంపై పార్టీ నాయకత్వానికి వివరించేందుకు సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్ కూడా అడిగారు. దీంతో మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీలో కల్లోలం చెలరేగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో అసంతృప్తి గళాలు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ హస్తం కూడా ఉండొచ్చనే చర్చ సాగుతోంది. తెలంగాణలో చేరికలను ప్రొత్సహించేందుకు బీజేపీలో ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తెర వెనుక మంత్రాంగం నడిపిస్తోంది. ఈటల రాజేందర్, డీకే అరుణ సహా పలువురు కీలక నేతలు ఉన్న ఈ కమిటీ.. ప్రస్తుతానికి ఎక్కువగా కాంగ్రెస్ నేతలపైనే ఫోకస్ చేసినట్టు టాక్. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తీరుపై అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని గుర్తించిన బీజేపీ నేతలు.. వారిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని.. దాని ఫలితంగానే కాంగ్రెస్‌లోని నేతలు ఈ రకమైన అసంతృప్తి గళాలు వినిపిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.  ప్రస్తుతం కాంగ్రెస్‌లో తీవ్రమైన అసంతృప్తి గళాలు వినిపిస్తున్న వారంతా బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో తమ ప్రధాన పోటీ టీఆర్ఎస్‌తోనే అని భావిస్తున్న బీజేపీ నాయకత్వం.. కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇవ్వడం వల్ల అది తమకు నష్టం కలిగిస్తుందనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది.

  Komatireddy: ‘‘మునుగోడులో ప్రచారానికొస్తా.. కానీ ఒక కండీషన్​ ’’: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

  Telangana: తెలంగాణ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. పదవికే ఎసరు రానుందా?

  అందుకే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడకుండా ఉండేందుకు కూడా బీజేపీ నేతలు తమదైన శైలిలో వ్యూహలను అమలు చేస్తున్నారని.. అందులో భాగంగానే కాంగ్రెస్‌లో కొత్తగా కొంతమంది అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల్లో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ కంటే ఎక్కువగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Congress, Telangana

  తదుపరి వార్తలు