Home /News /telangana /

TS POLITICS CONGRESS LEADERS BLAME TPCC FOR NOT INVITING OPPOSITION PARTIES PRESIDENTIAL CANDIDATE YASHWANT SINHA IN TELANGANA PRV

Telangana Congress: కాంగ్రెస్​లో మళ్లీ లొల్లి.. సొంత పార్టీ నాయకులపై మరోసారి జగ్గారెడ్డి విమర్శలు.. 

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైల్ ఫోటో

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైల్ ఫోటో

యశ్వంత్ సిన్హా తెలంగాణకు వస్తే ఒక్క టీఆర్ఎస్ మాత్రమే యాక్టివ్‌గా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ కలవడం లేదు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు.

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (opposition parties Presidential candidate Yashwant Sinha) తెలంగాణ పర్యటన టీ కాంగ్రెస్‌ (Telangana Congress)లో రచ్చకు కారణమైంది. ఆయనతో సమావేశమయ్యే విషయంలో టీ కాంగ్రెస్‌లో విభేదాలు వెలుగుచూశాయి. యశ్వంత్ సిన్హా తెలంగాణకు వస్తే ఒక్క టీఆర్ఎస్  (TRS)మాత్రమే యాక్టివ్‌గా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ కలవడం లేదు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) సీరియస్ అయ్యారు. యశ్వంత్ సిన్హాను ఎందుకు కలవరని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని జగ్గారెడ్ ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధిష్టానం తో మాట్లాడి సీఎల్పీ కి ఆహ్వానించేది ఉండాల్సిందని.. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

    పార్టీ అభ్యర్థి కారంటూ..

    అయితే తెలంగాణ కాంగ్రెస్​ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) రూట్​ మరోలా ఉంది. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో (In the presidential election) కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సిన్హాకు మద్దతిస్తారని, అయితే టీఆర్‌ఎస్‌ నేతలతో ముందుగా భేటీ అవుతున్నందున హైదరాబాద్‌లో ఆయనను కలవబోమని  రేవంత్‌రెడ్డి గురువారం ప్రకటించారు. మమతా బెనర్జీ, శరద్ పవార్ నిర్ణయించిన అభ్యర్థి సిన్హా అని.. కాంగ్రెస్ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే దీనిని పలువురు నాయకులు వ్యతిరేకించారు.

    స్వాగతం పలికిన వీహెచ్​..

    జాతీయ కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు బహిరంగంగా మద్దతు ఇచ్చిందని టీ కాంగ్రెస్​ నేతలు అన్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పుడు రాహుల్ గాంధీ కూడా అతనితో చేరారని చెప్పారు. దీంతో యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన.. టీ కాంగ్రెస్‌లో గొడవకు కారణమైంది. నేడు హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్​ బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    టీఆర్ఎస్​ గ్రాండ్​ వెల్​కమ్​..

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ ఘన స్వాగతం పలికింది. అనంతరం జల విహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి (Opposition presidential candidate) గురించి మాట్లాడుతూ.. యశ్వంత్​ సిన్హా లాయర్ వృత్తితో తన జీవితం ప్రారంభించారని, విదేశాంగ శాఖామంత్రిగా విదేశాల్లో సైతం మంచి గుర్తింపు సాధించారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోని ఓటు వేయాలని కోరుతున్నానని అన్నారు. ఇద్దరు ప్రెసిడెంట్ అభ్యర్థుల పనితీరు, తేడా ఒకసారి ఓటర్లు గమనించాలి. దేశంలో జరుగుతున్న విషయాలపై ప్రతీ ఒక్కరూ గొంతు ఎత్తాలి. దేశంలో కొత్త పరివర్తన రావాలి అని అన్నారు కేసీఆర్​.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Jaggareddy, President Elections 2022, Revanth Reddy, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు