అటు కేంద్ర అధికార పార్టీ బీజేపీ(BJP)ని ..రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్(TRS)ని విమర్శించడం కోసం కాచుకొని కూర్చున్న తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)నేతలకు సరైన టైమ్ వచ్చింది. ఆదివారం(Sunday) కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah)సికింద్రాబాద్ మహంకాళి (Secunderabad Mahankali)అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన బయటకువచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)అమిత్‌షాకు బూట్లు (Shoes)అందించారు. ఆ వీడియో(Video)పై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ పరువును, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని బీజేపీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టుపెట్టావంటూ మండిపడుతున్నారు. అటు కరీంనగర్ (Karimnagar)జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సైతం బండి సంజయ్ ప్రవర్తన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో ఉండే బండి సంజయ్ కరీంనగర్ జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారంటూ ఇలాంటి పనుల చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. బండి సంజయ్ చేసిన తప్పుకు యావత్ తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అట్లా బుక్కైపోయిన బండి సంజయ్..
మునుగోడు సమరభేరీ సభ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. పార్టీ హైకమాండ్ ఎంతో పద్దతిగా ప్రజల్ని , పార్టీ నేతల్ని, క్యాడర్‌ను కలుపుకుని తెలంగాణలో వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఈ టైమ్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన చిన్న పొరపాటు ఆయనకు స్థాయిని తగ్గించడమే కాకుండా బీజేపీపై అహంకార పార్టీ అనే ముద్రపడే విధంగా సీన్ క్రియేట్ అయింది. టీఆర్ఎస్, బీజేపీ దొంగలకు ఆత్మగౌరవం ఉండదు! మోసం, కపటం, దోపిడీ, ఇట్లా తమ లాభం కోసం సిగ్గు శరాలు అన్ని వదిలేసి నంగానాచ్ చెయ్యమన్నా కూడ చేస్తరు. చెప్పులేమి కర్మ ఇంకేమైనా కడుగుతరు!అంటూ తెలంగాణ కాంగ్రెస్ బండి సంజయ్ అమిత్‌షా చెప్పులు అందిస్తున్న వీడియోతో పాటు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మోదీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పాదాలకు వందనం చేస్తున్న వీడియోతో పాటు కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ పక్కనే కూర్చున్న వీడియోని యాడ్ చేసి తమ సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేశారు.
తెరాస+బీజేపీ దొంగలకు ఆత్మగౌరవం ఉండదు! మోసం, కపటం, దోపిడీ, ఇట్లా తమ లాభం కోసం సిగ్గు శరాలు అన్ని వదిలేసి నంగానాచ్ చెయ్యమన్నా కూడ చేస్తరు. చెప్పులేమి కర్మ ఇంకేమైనా కడుగుతరు!
అదే ఆత్మగౌరవానికి నిలువు నిదర్శమైన కాంగ్రెస్, తమ సహచరులను హుందాగా చూస్తుంది, ప్రజా సమస్యలపైన పోరాడుతుంది. pic.twitter.com/u2YNzyhTzG
— Telangana Congress (@INCTelangana) August 22, 2022
కడిగిపారేస్తున్న కాంగ్రెస్ నేతలు ..
అంతే కాదు ఆత్మగౌరవానికి నిలువు నిదర్శమైన కాంగ్రెస్, తమ సహచరులను హుందాగా చూస్తుంది, ప్రజా సమస్యలపైన పోరాడుతుందని కామెంట్‌ని షేర్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం ఒకప్పటి తడీపార్ కాళ్ళ వద్ద పెట్టిన బండి..! ఇప్పుడు బీజేపీ పెద్దల కాళ్ల దగ్గర పెట్టారని విమర్శిస్తున్నారు. బీజేపీలో నేతల కట్టుబానిసత్వానికి పరాకాష్ట అని అటాక్ చేస్తున్నారు. బీజేపీలో మీ బ్రతుకులు ఇంత నీచమా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడే చెప్పులు మోస్తుంటే మిగిలిన వాళ్ల ఇంకేమి పనులు చెయ్యాలో అంటూ సెటైర్లు వేస్తున్నారు.
వివాదాస్పదమైన వాఖ్యలు చేస్తూ ఎప్పుడు ప్రచారంలో ఉండే ప్రయత్నం చేస్తూన్న @bandisanjay_bjpగారూ ఆకరికి @AmitShahగారి బూట్లు మోసి కరీంనగర్ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అగొరపరిచరు,ఒక్క గౌరప్రధమైన స్థానంలో ఉండి ఇలాంటి పనులుచేయటం యావత్ తెలంగాణ పౌరులకే సిగ్గుచేటు,వెంటనే తను చేసింది(1/2) pic.twitter.com/VIOpUYNtxF
— Ponnam Prabhakar (@PonnamLoksabha) August 22, 2022
క్షమాపణ చెప్పాల్సిందే...
కాంగ్రెస్ సీనియర్ నేత, కరీనంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఒక గౌరవ ప్రదమైన స్థానంలో ఉండి బూట్లు మోయడం ఏమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ చేసిన పనికి ఒక కరీంనగర్ పౌరుడిగా, ఓటరుగా తమతో పాటు యావత్ తెలంగాణ పౌరులకే సిగ్గుచేటుగా భావిస్తున్నామన్నారు. వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని పొన్న ప్రభాకర్ డిమాండ్ చేశారు. అటు మరో నేత అద్దంకి దయాకర్ సైతం బండి తీరు అత్యంత హేయంగా, నీచంగా ఉందన్నారు.
సంజయ్ సమాధానం ఏంటో..?
ఆదివారం ఉదయం అమిత్‌షా సికింద్రాబాద్‌లోని బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లి టీ తాగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలకు సైతం అండగా ఉంటుందని అమిత్‌షా తెలిపారు. ఈ సంకేతం పూర్తిగా ప్రజల్లో వెళ్లక ముందే బండి సంజయ్ అమిత్‌షా బూట్లు అందించిన వీడియోని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కించపరుస్తూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఈరాజకీయ దుమారంపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.