Home /News /telangana /

TS POLITICS CONGRESS LEADER SRAVAN DASOJU JOINED IN BJP HE PLANS TO CONTEST FROM THESE CONSTITUENCY HERE DETAILS NS

Dasoju Sravan: బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్.. ఆ సంచలన స్థానం నుంచి ఎంపీకి సై?

దాసోజు శ్రవణ్ (ఫైల్ ఫొటో)

దాసోజు శ్రవణ్ (ఫైల్ ఫొటో)

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రావణ్.. కొద్ది రోజుల్లోనే మంచి సబ్జెక్ట్ ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) వలసల జోరు కొనసాగుతోంది. అయితే.. ఈ వలసలు ప్రధానంగా కాంగ్రెస్ నుంచి బీజేపీ (BJP) లోకి కొనసాగుతున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రజా రాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్.. కొద్ది రోజుల్లోనే మంచి సబ్జెక్ట్ ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న శ్రావణ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 91 వేల ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో ఆయన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. చేరిన కొద్ది కాలంలోనే ఆయన కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహితుడిగా మారారు. టీవీ చర్చల్లో, వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఆయన. అయితే.. టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ను ఆశించిన శ్రవణ్.. టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురై పార్టీని వీడారు.

    అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి.. అక్కడ కూడా తక్కువ కాలంలోనే అధిష్టానం ఆశిస్సులు పొందారు. దీంతో ఆయనను ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది హై కమాండ్. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని సైతం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఖైరతాబాద్ కు చెందిన మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో మనస్థాపానికి చెందిన శ్రావణ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే.. ఆయనకు బీజేపీ ఎలాంటి హామీ ఇచ్చిందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
    CM KCR-Bandi Sanjay: కేసీఆర్ వాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్

    గత ఎన్నికల నాటి నుంచి ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. సీనియర్ నేత అయిన రామచంద్రారెడ్డిని కాదని శ్రావణ్ కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే.. భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని తాను టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో ఆసక్తి చూపారు శ్రవణ్. అయితే.. బీజేపీ నుంచి అయినా టికెట్ తెచ్చుకుని అక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.

    ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అది సాధ్యం కాకపోతే.. గ్రేటర్ పరిధిలోని ఏదో ఓ స్థానం నుంచి దాసోజు శ్రవణ్ ను బీజేపీ బరిలోకి దించే అవకాశం ఉంది. చింతల రామచంద్రారెడ్డికి నచ్చజెప్పి ఖైరతాబాద్ నుంచే శ్రావణ్ ను బరిలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bjp, Telangana Politics, TS Congress

    తదుపరి వార్తలు