హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR | Rahul Gandhi: కేసీఆర్ వ్యూహంలో వేలు పెడుతున్న కాంగ్రెస్.. సరికొత్త వ్యూహం ?

KCR | Rahul Gandhi: కేసీఆర్ వ్యూహంలో వేలు పెడుతున్న కాంగ్రెస్.. సరికొత్త వ్యూహం ?

కేసీఆర్, రాహుల్, రేవంత్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్, రాహుల్, రేవంత్ (ఫైల్ ఫోటో)

తెలంగాణలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే అలా చేయడం వీలు కాదని కేంద్రం కుండబద్ధలు కొట్టింది.

తెలంగాణలో ఇప్పుడు రాజకీయమంతా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది. అనేక అంశాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. కేంద్రాన్ని ఇరుకునపెట్టడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని టార్గెట్ చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ యాసంగి ధాన్యం కొనుగోలు అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. తెలంగాణలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే అలా చేయడం వీలు కాదని కేంద్రం కుండబద్ధలు కొట్టింది. దీంతో కేంద్రంలోని అధికార బీజేపీపై పోరాటం చేయాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ పోరాటంలో రాష్ట్రంలోని రైతులను భాగస్వాములను చేయాలని భావిస్తోంది.

ఉగాది తరువాత ఈ పోరాటాన్ని తీవ్రం చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్(TRS) అధినాయకత్వం.. ఈ పోరాటాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ముందుండి నడిపిస్తారని చెబుతోంది. దీనిపై ఢిల్లీలోనూ పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఓ వైపు బీజేపీని టార్గెట్ చేసే విషయంలో టీఆర్ఎస్ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతుంటే.. ఈ అంశంపై కాంగ్రెస్... టీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తోంది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ధాన్యం కొనుగోలు అంశంపై తెలుగులో మంగళవారం ఓ ట్వీట్‌ చేసిన రాహుల్ గాంధీ (Rahul Gandhi).. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని అన్నారు. తెలంగాణ(Telangana) రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇస్తోంది. రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ ముఖ్యనేత కవిత పిలుపు ఇచ్చారు. అయితే ఉన్నట్టుండి రాహుల్ గాంధీ ఈ అంశంపై ట్వీట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే.. పార్టీకి మరింత నష్టమా ?

Telangana BJP: రేపు తెలంగాణకు బీజేపీ ముఖ్యనేత.. అప్పుడే పని మొదలుపెట్టారా ?.. వాటిపైనే ఫోకస్

బీజేపీని టార్గెట్ చేసేందుకు టీఆర్ఎస్ మొదలుపెట్టిన ఈ పోరాటంలో కాంగ్రెస్ కూడా పాలుపంచుకునేందుకు సిద్ధమవుతోందని.. అందుకే రాహుల్ గాంధీ ద్వారా ఈ అంశంపై రాష్ట్ర నేతలు ట్వీట్ చేయించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశంపై పోరాటం చేసేందుకు రంగంలోకి దిగితే.. అప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీల మధ్య భిన్నమైన పోరాటాలకు కేంద్రంగా మారుతుందనే చర్చ కూడా సాగుతోంది.

First published:

Tags: Congress, Telangana

ఉత్తమ కథలు