తెలంగాణ (Telangana )లో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ (TRS) ను గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ (MP Rahul Gandhi)ని రప్పించింది. ఈ నేపథ్యంలో నేడు ఎంపీ రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. శుక్రవారం వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రాహుల్ బస చేశారు. ఇక నేటి రాహుల్ షెడ్యూల్ (Rahul gandhi second day schedule)ని పరిశీలిస్తే.. శనివారం (నేడు) ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన అల్పాహారం చేయనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనవారితో హోటల్లోనే ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
నేడు మధ్యాహ్నం హోటల్ తాజ్ కృష్ణ (taj krishna) నుంచి బయలుదేరి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. అక్కడ దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు. తర్వాత సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. గాంధీభవన్ లో పార్టీ మీటింగ్ లో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50 గంటల వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ కార్యక్రమం అనంతరం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.
వరంగల్ సభలో..
శుక్రవారం జరిగిన వరంగల్ సభలో రాహుల్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నారని.. కానీ ఆయన ముఖ్యమంత్రి కాదని ఒక రాజు అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు వింటాడని..కానీ రాజు అవేమీ వినడని.. తాను చేయాలనుకున్నది చేస్తాడని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో రైతుల రుణమాఫీ చేశామని.. వరికి రూ. 2500 మద్దతు ధర ఇస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణలోని టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు, స్నేహం ఉండదని రాహుల్ స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తిన నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్తో(TRS) పొత్తు అనే నేతలు తమకు అవసరం లేదన.. వాళ్లు టీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరొచ్చని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమవుతుందని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ(Telangana) ఏర్పాటు అంత సులువుగా జరగలేదని.. తమకు నష్టం జరుగుతందని తెలిసి కూడా కాంగ్రెస్(Congress) ఇక్కడి ప్రజల కోసం నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లేదని రాహుల్ విమర్శించారు.
చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ (NSUI) నేతలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారా..? లేదా..? అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే మధ్యాహ్నం ఎన్ఎస్యూఐ నేతలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సంజీవయ్య పార్క్ నుంచి చంచల్ గూడ వెళ్తారని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Rahul Gandhi, Telangana Politics, TS Congress