TS POLITICS CONGRESS LEADER RAHUL GANDHI IS COMING TO TELANGANA TODAY AND THE DETAILS OF THE MINUTE TO MINUTE SCHEDULE ARE AS FOLLOWS PRV
Rahul gandhi Telangana visit: నేడు తెలంగాణకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాక.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..
రాహుల్ గాంధీ ( పైల్)
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ టూర్ ఉండనుంది. ఈ మేరకు మినిట్ టూ మినిట్ షెడ్యూల్ ఖరారయింది.
తెలంగాణ(Telangana )లో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ (TRS) ను గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ (MP Rahul Gandhi)ని రప్పించాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలు (Rahul gandhi Telangana visit) ఖరారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ టూర్ ఉండనుంది. ఈ మేరకు మినిట్ టూ మినిట్ షెడ్యూల్ ఖరారయింది.
ఈ షెడ్యూల్ ప్రకారం.. 6వ తేదీన
రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో Hyderabad శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 5:10కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ (Warangal) బయలుదేరుతారు. 5:45 గంటల వరకు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు. తదుపరి సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ (Farmers Sangharshana Meeting)లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 8:00 గంటలకు రాహుల్ గాంధీ వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో బస చేస్తారు రాహుల్..
7వ తేదీ షెడ్యూల్ వివరాలు..
7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:30కి రాహుల్ గాంధీ హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. 12:50 నుంచి 1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ కార్యక్రమం అనంతరం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.
వాళ్లను పరామర్శించకుండానే..?
అయితే. ముందుగా అనుకున్న పర్యటన ప్రకారం రాహుల్ ఓయూ (OU)లో పర్యటించాల్సి ఉంది. కానీ, ఈ షెడ్యూల్ ప్రధానంగా ఓయూలో సమావేశం, ఎన్ఎస్యూఐ నేతల్ని రాహుల్ గాంధీ పరామర్శించడం లేకుండానే తయారు చేశారు. రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అయినా నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా .. ఓయూలో సమావేశం పెడతామని కాంగ్రెస్ నేతలు చెప్పుకోచ్చారు. అలాగే.. అరెస్టయిన ఎన్ఎస్యూఐ నేతల్ని రాహుల్ గాంధీ పరామర్శిస్తారని భారీ ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు. అయితే ఈ రెండు కార్యక్రమాలూ షెడ్యూల్లో లేవు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగినా జరగొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.