కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్‌కు చేరుకోనున్నారు. వరంగల్‌లో(Warangal) కాంగ్రెస్ నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్లాన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. లక్ష మంది ఈ సభకు వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ సభ ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇక షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 5:45 గంటల వరకు వరంగల్ గాబ్రియెల్ స్కూల్‌కు చేరుకోవాల్సి ఉంది. తదుపరి సాయంత్రం 6:05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ (Farmers Sangharshana Meeting)లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 8:00 గంటలకు రాహుల్ గాంధీ వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో బస చేస్తారు రాహుల్..
రేపటి షెడ్యూల్ వివరాలు..
7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:30కి రాహుల్ గాంధీ హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. 12:50 నుంచి 1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ కార్యక్రమం అనంతరం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆ లైన్లోనే వెళతారా ?.. తాము అనుకున్నట్టు చేస్తారా ?.. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్
అయితే. ముందుగా అనుకున్న పర్యటన ప్రకారం రాహుల్ ఓయూ (OU)లో పర్యటించాల్సి ఉంది. కానీ, ఈ షెడ్యూల్ ప్రధానంగా ఓయూలో సమావేశం, ఎన్ఎస్యూఐ నేతల్ని రాహుల్ గాంధీ పరామర్శించడం లేకుండానే తయారు చేశారు. రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అయినా నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా .. ఓయూలో సమావేశం పెడతామని కాంగ్రెస్ నేతలు చెప్పుకోచ్చారు. అలాగే.. అరెస్టయిన ఎన్ఎస్యూఐ నేతల్ని రాహుల్ గాంధీ పరామర్శిస్తారని భారీ ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు. అయితే ఈ రెండు కార్యక్రమాలూ షెడ్యూల్లో లేవు. అయితే చివరి నిమిషంలో మార్పులు జరిగినా జరగొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi, Telangana