Home /News /telangana /

TS POLITICS CONGRESS LEADER MP RAHUL GANDHI VISIT TO TELANGANA HAS BEEN FINALIZED DATES AND EVENT FULL SCHEDULE HERE PRV

Rahul gandhi Telangana visit: రెండు రోజుల్లో రాహుల్​ గాంధీ తెలంగాణ పర్యటన.. ఏ రోజు ఎక్కడ ఉండనున్నారంటే..?

రాహుల్ గాంధీ ( పైల్)

రాహుల్ గాంధీ ( పైల్)

తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ పుంజుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణకు రాహుల్​గాంధీ (Rahul Gandhi)ని రప్పించాలని డిసైడ్​ అయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలు ఖరారయ్యాయి.

    తెలంగాణలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ (TRS) ను గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్​గాంధీ (MP Rahul Gandhi)ని రప్పించాలని డిసైడ్​ అయ్యారు కాంగ్రెస్​ నేతలు. ఈ నేపథ్యంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలు(Rahul gandhi Telangana tour) ఖరారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్​ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ టూర్​ ఉండనుంది. 6వ తేదీన రాహుల్ నేరుగా హైదరాబాద్​లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాహుల్ గాంధీ వరంగల్​ (Warangal) కు చేరుకొంటారు. వరంగల్ లో కాంగ్రెస్​ (Congress) పార్టీ నిర్వహిస్తున్న సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు

    ఆత్మహత్య (Suicide) చేసుకొన్న రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ ఈ సభలోనే పరామర్శిస్తారు. ఈ సభలోనే తమ ప్రభుత్వ హయంలో రైతులకు ఏం చేసిందనే విషయాలను రాహుల్ గాంధీ వివరించనున్నారు. మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయనున్నారనే విషయాలను కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రకటించనున్నారు. వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది.

    రాహుల్ గాంధీ వరంగల్ సభ ముగిసిన తర్వాత హైదరాబాద్​ (Hyderabad) లో బస చేస్తారు. ఈ నెల 7వ తేదీన ఉదయం సంజీవయ్య సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుండి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పింగళి వెంకట్రామిరెడ్డి హాల్ లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఇదే సమావేశ మందిరంలో పలువురు మేధావులతో కూడా రాహుల్ గాంధీ భేటీ అవుతారు.ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ భవన్​ కు చేరుకొంటారు. టీపీసీసీ కార్యవర్గంతో రాహుల్ గాంధీ భేటీ అవుతారు.

    కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో రాహుల్ గాంధీ ఫోటో సెషన్ లో పాల్గొంటారు. ఈ ఫోటో సెషన్ ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న రోజుల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించనున్నారు.గాంధీభవన్ నుండి రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుండి ఢిల్లీకి వెళ్తారు.

    గత రెండు టర్మ్ లు రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారానికి దూరమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని ఫణంగా పెట్టి తెలంగాణ ఇచ్చినా కూడా అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాజకీయంగా నష్టం వాటిల్లింది. అయితే ఈ దఫా మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకున్న సునీల్ వ్యూహాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలను చేపట్టనున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Rahul Gandhi, Telangana, Warangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు