హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: కాంగ్రెస్‌లో కొత్త రచ్చ..ఆ ప్రచారంలో నిజం లేదన్న కీలక నేత.. రేవంత్ రెడ్డికి బ్రేక్ పడుతుందా ?

Telangana Politics: కాంగ్రెస్‌లో కొత్త రచ్చ..ఆ ప్రచారంలో నిజం లేదన్న కీలక నేత.. రేవంత్ రెడ్డికి బ్రేక్ పడుతుందా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Congress: ఇటీవల కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారిలో కార్పొరేటర్ స్థాయి నుంచి మాజీమంత్రి స్థాయికి చెందిన నేతల వరకు ఉన్నారు.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నుంచి ఎదురవుతున్న పోటీని కాంగ్రెస్ ఏ మేరకు తట్టుకుంటుందనే అంశంపై ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ (Congress) నేతలు మాత్రం బీజేపీ ఎంత దూకుడుగా ముందుకు సాగినా.. అంతిమంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కడతారనే భావనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు, బీజేపీకి అంతా పైపైన ఆర్భాటం మాత్రమే అని.. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్‌కు(TRS) బలమైన పోటీకి ఇవ్వబోయేది కాంగ్రెస్ మాత్రమే అన్నది కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల ధీమా. ఇదిలా ఉంటే ఇటీవల కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారిలో కార్పొరేటర్ స్థాయి నుంచి మాజీమంత్రి స్థాయికి చెందిన నేతల వరకు ఉన్నారు. వారిలో ఎక్కుమంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

అయితే ఈ చేరికలు కారణంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. తమ జిల్లాల నుంచి నేతలను చేర్చుకునే సమయంలో తమకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్న నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై స్పష్టమైన హామీ లభించిందనే చర్చ కూడా జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కాబట్టే.. కొందరు నేతలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పిన మల్లు భట్టి విక్రమార్క.. టికెట్ హామీతోనే నేతలు పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. అలాంటి హామీలు కాంగ్రెస్‌లో ఎవరూ ఇవ్వలేరని.. కాంగ్రెస్ హైకమాండ్ విధానపరంగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తుందని మల్లు భట్టి విక్రమార్క కామెంట్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి టార్గెట్‌గానే మల్లు భట్టి విక్రమార్క ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

Dalit Bandhu : నిన్న పనోడు.. నేడు ఓనరు : 'దళిత బంధు' పథకం తెచ్చిన మార్పు ఇదే!

TRS | BJP : బీజేపీకి షాకిచ్చిన టీఆర్ఎస్.. జాతీయ భేటీ, మోదీ సభ వేళ ఎటుచూసినా కేసీఆర్!

రేవంత్ రెడ్డి చాలామంది నేతలకు టికెట్ ఇప్పిస్తాననే హామీతోనే పార్టీలోకి చేర్చుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో అలా జరగడం కష్టమని.. రేవంత్ రెడ్డి ఇచ్చే హామీలను నేతలు పట్టించుకోవద్దనే సంకేతాలు ఇవ్వడానికే మల్లు భట్టి విక్రమార్క ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు తన సొంత జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేను చేర్చుకునే విషయంలోనూ తనకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే భట్టి విక్రమార్క ఈ రకమైన కామెంట్స్ చేశారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

First published:

Tags: Bhatti Vikramarka, Congress, Revanth Reddy, Telangana

ఉత్తమ కథలు