Home /News /telangana /

TS POLITICS CONGRESS LEADER MADHU YASHKI DEMANDS MUNUGODU TICKET FOR BACKWARD CLASSES AK

Munugodu| Congress: మునుగోడుపై కాంగ్రెస్‌లో కొత్త డిమాండ్.. వారికే టికెట్ ఇవ్వాలంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ వేసుకున్న కమిటీలో కీలక సభ్యుడైన తెలంగాణ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్త డిమాండ్ చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ కాంగ్రెస్‌కు మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక ఓ పెద్ద పరీక్ష అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఆ పార్టీ ఎంతగానో కష్టపడుతోంది. అయితే మునుగోడులో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న ఆ పార్టీ.. ముందుగా అభ్యర్థి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలనే యోచనలో ఉంది. అయితే అది అంత సులభంగా తేలే విషయం కాదని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ (Congress) ముఖ్యనేతలు చేపట్టారు. అయితే టికెట్ తమకు ఇవ్వాలంటే పట్టుబడుతున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వడం కంటే ముందు అందరినీ ఒప్పించి అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన సవాల్.

    అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ వేసుకున్న కమిటీలో కీలక సభ్యుడైన తెలంగాణ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ (Madhu Yashki) మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్త డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ బరిలో బీసీ అభ్యర్థిని నిలపాలని ఆయన పట్టుబడుతున్నట్టు సమాచారం. అంతేకాదు.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇస్తే.. పాత వాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.



    ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చెరుకు సుధాకర్ గురించే అనే చర్చ కూడా సాగుతోంది. చెరుకు సుధాకర్ కూడా బీసీ వర్గానికి చెందిన నాయకుడే అయినా.. ఆయన కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌లో చేరడంతో.. ఆయనకు కాంగ్రెస్ నాయకత్వం మునుగోడులో పోటీ చేసే అవకాశం కల్పిస్తుందా ? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీసీలకు మునుగోడు టికెట్ ఇవ్వాలంటున్న మధుయాష్కీ.. ఈ విషయంలో పార్టీ నాయకత్వం ముందు ఎలాంటి ప్రతిపాదనలు ఉంచుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

    TRS| Munugodu: ‘మునుగోడు’‌పై టీఆర్ఎస్ ఫోకస్.. ముందుగా వారికి బుజ్జగింపులు.. ఎందుకంటే..

    TS Teacher Jobs: తెలంగాణ టీచర్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇలా చదివితే మంచి రిజల్ట్.. ఓ లుక్కేయండి

    అయితే మధుయాష్కీ తెరపైకి తీసుకొస్తున్న ఈ డిమాండ్ కారణంగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం, మరింత జఠిలమయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక వర్గం నాయకులకు అవకాశాలు వస్తున్నాయనే భావన చాలామంది ఉందనే వాదనను మధు యాష్కీ చేస్తున్నారు. ఈ భావన పోవాలంటే.. బీసీలకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీసీ వర్గాలకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన మధుయాష్కీ చేస్తున్న డిమాండ్ ప్రభావం.. మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఏ మేరకు ఉంటుందో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు