Home /News /telangana /

TS POLITICS CONGRESS LEADER MADHU YASHKI ABSENT TO MANIKAM TAGORE MEETING IN HYDERABAD REGARDING MUNUGODU BY ELECTIONS AK

Madhu Yashki: కాంగ్రెస్ కీలక భేటీకి మధుయాష్కీ డుమ్మా.. ఠాగూర్ సీరియస్.. అదే కారణమా ?

మధుయాష్కీ (ఫైల్ ఫోటో)

మధుయాష్కీ (ఫైల్ ఫోటో)

Telangana Congress: మునుగోడు నియోజకవర్గంలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. కాబట్టి అక్కడ బీసీ నాయకులకు టికెట్ ఇవ్వాలని మధుయాష్కీ వాదిస్తున్నట్టు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన మధుయాష్కీపై (Madhu Yashki) రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడు ఉప ఎన్నికల అంశానికి సంబంధించి కాంగ్రెస్(Congress) పార్టీ వేసి వ్యూహరచన కమిటీలో ఉన్న మధుయాష్కీ.. ఈ రోజు జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నారు. దీనిపై మాణిక్యం ఠాగూర్(Manikam Tagore) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే కమిటీలో కీలక వ్యక్తిగా ఉంటూ.. ఆయన ఈ రకమైన సమావేశానికి దూరంగా ఉండటాన్ని మాణిక్యం ఠాగూర్ తప్పుబట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మధుయాష్కీ ఇలా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటం వెనుక రేవంత్ రెడ్డితో ఆయనకు ఉన్న విభేదాలే కారణమనే వాదన వినిపిస్తోంది.

    ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని.. నిజామాబాద్ జిల్లాలో తనను విమర్శించే కొందరు నేతలకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారనే భావన మధుయాష్కీకి ఉందని పార్టీలో టాక్ ఉంది. అంతేకాదు మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మధుయాష్కీ ఆలోచన, రేవంత్ రెడ్డి ఆలోచన భిన్నంగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీసీలకు ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. కాబట్టి అక్కడ బీసీ నాయకులకు టికెట్ ఇవ్వాలని ఆయన వాదిస్తున్నట్టు సమాచారం.



    ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే అపవాదు కూడా పోతుందని మధుయాష్కీ పదే పదే చెబుతున్నారని సమాచారం. అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని టీపీసీసీ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక సీటును బీసీ నాయకుడికి బదులుగా రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉందని పలువురు అభిప్రాయడుతున్నారు.

    KCR: కేసీఆర్ 'మునుగోడు' ఫ్లాన్ రెడీ.. ఆ నినాదంతోనే బీజేపీకి చెక్ చెప్పాలని నిర్ణయం ?

    Congress: కాంగ్రెస్​లో మరో కల్లోలం.. ఠాగూర్​పై మర్రి శశిధర్​ రెడ్డి సంచలన ఆరోపణలు

    బీసీ నాయకులకు టికెట్ ఇచ్చే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బలమైన పోటీ ఇచ్చే నాయకుడిని ఎంపిక చేయడం మంచిదనే అభిప్రాయంతో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఉన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలుస్తోంది. దీంతో తన మాటకు విలువ ఇవ్వకుండా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారని భావిస్తున్న మధుయాష్కీ.. కమిటీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని.. ఏదో మొక్కుబడిగా మాత్రమే వీటికి హాజరవుతున్నారని కాంగ్రెస్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Munugodu By Election, Telangana

    తదుపరి వార్తలు