హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics : ఆ మంత్రికి డైపర్స్ పంపుతా .. ఈ మాట ఎవరన్నారో తెలుసా

Telangana Politics : ఆ మంత్రికి డైపర్స్ పంపుతా .. ఈ మాట ఎవరన్నారో తెలుసా

(Photo: Instagram)

(Photo: Instagram)

Telangana Politics: ఎన్నికలకు ఏడాది ముందే ఓరుగల్లు పోరుగల్లుగా మారుతుందనే సంకేతాలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఎర్రబెల్లి, కొండా సురేఖల మధ్య పొలిటికల్ ఫైట్ ఇప్పటి నుంచే మొదలైనట్లుగా కనిపిస్తోంది. కొండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొండాసురేఖ కుమార్తె మంత్రిపై చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నారు జిల్లా ప్రజలు.

ఇంకా చదవండి ...

వేసవి ముగిసినప్పటికి తెలంగాణలో పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. పార్టీలు ప్రజాసమస్యలపై కొట్లాడుకుంటూనే ..మరోవైపు తమ వ్యక్తిగత విషయాలను హైలెట్‌ చేసుకుంటున్నారు నేతలు. నిన్నటి వరకు వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌(Congress)టీఆర్‌ఎస్‌(TRS)నేతల మధ్య ఉన్న కోల్డ్‌వార్‌ కాస్తా ప్రజెంట్ కౌంటర్‌లు ఇచ్చుకునే స్థాయి నుంచి వార్నింగ్‌లు ఇచ్చే వరకు వెళ్లింది. వరంగల్‌(Warangal) జిల్లాలో కొండా సురేఖ(Konda surekha) దంపతులు ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakarrao)అంతే పలుకుబడి ఉన్న నేత. అయితే ఈ రెండు పార్టీల నేతల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉన్నప్పటికి..ఆధిపత్య పోరు విషయంలో మాత్రం ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎర్రబెల్లి , కొండా ఫ్యామిలీ మధ్య వార్‌ కొండా(Konda) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (Pre release event‌)వేదికగా మరోసారి బయటపడింది.

పోరుగల్లుగా మారేనా ..

వరంగల్‌లోని ఖుష్‌ మహల్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన కొండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. అయితే ప్రోగ్రామ్‌కి రేవంత్‌రెడ్డి అటెండ్‌ కాకుండా పోలీసులు అడ్డుపడ్డారు. రేవంత్‌రెడ్డిని ఈవెంట్‌కి రాకుండా చేశారనే కోపాన్ని కొండా సురేఖ, మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్‌ వేదికపై నుంచి వెళ్లగక్కారు. తన తల్లిదండ్రులు జీవిత కథ డబ్బుల కోసం, పదవుల కోసమే అని కొందరు ప్రాపకాండ చేస్తున్నారని అందులో వాస్తవం లేదన్నారు . మాకు డబ్బు అవసరం లేదని...పదవులు త్యాగం చేసిన చరిత్ర అంటూ చెప్పుకొచ్చారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత. సినిమా స్టోరీ అందరూ చూడాల్సిన కథ అని అణగదొక్కే వ్యవస్థలోంచి తన తల్లిదండ్రులు రాజకీయ శక్తులుగా ఎలా ఎదిగారన్నది అందరికి తెలియాలన్నారు.

ఇది చదవండి: అగ్నిపథ్‌ రద్దు కోసం కాంగ్రెస్‌ దీక్ష .. బీజేపీ మెడలు వంచుతామంటున్న హస్తం నేతలు



పొలిటికల్ ఫైట్ ..

సినిమా గురించి ప్రస్తావిస్తూనే జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు సుస్మిత పటేల్. హీరోయిన్ సాయిపల్లివి ఈవెంట్‌కి రెడ్ కార్పెట్ వేసిన ఎర్రబెల్లి మా పులి రేవంత్‌రెడ్డిని చూసి భయపడి ఈవెంట్‌కు రాకుండా అరెస్ట్ చేయించారని ప్రత్యక్షంగానే మాటలతో దాడి చేశారు. ఏదైనా తేల్చుకోవడానికి మేం ఎప్పుడూ సిద్ధమేనని...రాబోయే ఎన్నికల్లో మేం ఏంటో చూపిస్తామని మంత్రిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. అంతే కాదు ఇకపై దయాకర్‌రావుకి డైపర్‌లతో అవసరం ఉంటుందని తనకు ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారని...పంపిద్దామా అంటూ పరుష పదజాలంతో కూడిన మాటలను మాట్లాడారు కొండాసురేఖ కుమార్తె సుస్మిత.

ఇది చదవండి : కలకలం రేపుతున్న సర్పంచ్ ఆత్మహత్యాయత్నం .. ఊరి జనం అలా చేసినందుకేనట



సినిమా ఇప్పుడే మొదలైంది..

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడే శక్తి , సామర్ధ్యం కలిగిన ఫ్యామిలీ కొండా సురేఖది ఒక్కటేనని అందరికి తెలుసు. అయితే సినిమా పేరుతో వాళ్ల రియల్ స్టోరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ కోసమేనని జిల్లాలోని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్న మాట. కొద్దిరోజుల క్రితం వరకు కాంగ్రెస్‌లో అసంతృప్తితో అంటి ముట్టనట్లుగా ఉన్న కొండా దంపతులు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కొండంత అండ దొరికిందన్న జోష్‌లో ఉన్నారు. జిల్లాలో రెండు స్థానాల్లో పోటీ చేయాలనే పక్కా ప్లాన్‌ కూడా వేసుకున్నారు కొండా దంపతులు. అదే జరిగితే ఎర్రబెల్లికి పోటీగా ప్రత్యర్దిగా నిలబడి గెలవాలన్నది కొండా సురేఖ దంపతుల ఆలోచన అనే టాక్‌ వినిపిస్తోంది. కొండా దంపతులు ఎంతో ప్రెస్టేజ్‌తో తీసిన కొండా సినిమా సక్సెస్‌తో కూడా వీళ్ల పొలిటికల్ లైఫ్ ముడిపడి ఉందని కూడా కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇది చదవండి : కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..పువ్వాడ వర్సెస్‌ వైఎస్ షర్మిల సవాళ్లు


First published:

Tags: Errabelli Dayakar Rao, Konda surekha, Telangana Politics

ఉత్తమ కథలు