హోమ్ /వార్తలు /తెలంగాణ /

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసు.. మునుగోడు రిజల్ట్ తరువాత కీలక నిర్ణయం

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసు.. మునుగోడు రిజల్ట్ తరువాత కీలక నిర్ణయం

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Photo Credit:Face Book)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Photo Credit:Face Book)

Komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటన్న దానిపై ఓ క్లారిటీ వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పార్టీ హైకమాండ్ మరోసారి షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీజేపీ తరపున మునుగోడులో పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి(Komatireddy Rajagopal Reddy) ఓటు వేయాలని ఆయన కాంగ్రెస్ నేతలకు కోరిన ఆడియో లీక్ కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. గతంలో ఓసారి ఆయనకు ఈ అంశంపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే దీనిపై ఆయన సమాధానం ఇవ్వలేదు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండేందుకు ఆయన ఆస్ట్రేలియా టూర్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తరువాత కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసు అంశంపై స్పందించలేదు.

అంతేకాదు తనకు కాంగ్రెస్ అధిష్టానం క్లీన్ చిట్ ఇచ్చేంతవరకు తాను పార్టీ వ్యవహారాల్లో పాల్గొనబోనని ఆయన చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన తనకు పార్టీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై స్పందించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) రెండోసారి షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీంతో ఆయన తనకు రెండోసారి వచ్చిన షోకాజ్ నోటీసుపై ఏ రకంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటన్న దానిపై ఓ క్లారిటీ వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి చేరుకోవడం దాదాపు ఖాయమే అనే చర్చ జరుగుతోంది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే.. వెంకట్ రెడ్డి ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Trs MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఆడియో, వీడియోల బహిర్గతంపై తెలంగాణ హైకోర్టు ఆరా

Kishan Reddy: అందమైన అబద్దం ఆ వీడియో..కేసీఆర్ ప్రెస్ మీట్ పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే.. తన వ్యవహారశైలితో కొంతకాలం నుంచి కాంగ్రెస్‌ను ఇబ్బందిపెడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎపిసోడ్‌కు ఏదో రకంగా ఫుల్ ‌స్టాప్ పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆయన పార్టీ క్రమశిక్షణను పాటించకుండా మొండిగా వ్యవహరిస్తే.. ఆయనపై చర్యలు తీసుకునే యోచనలో ఆ పార్టీ ఉందనే చర్చ కూడా సాగుతోంది.

First published:

Tags: Congress, Komatireddy venkat reddy, Telangana