Home /News /telangana /

TS POLITICS CONGRESS HIGH COMMAND PLANNING FOR BUS YATRA IN TELANGANA IN WHICH ALL TELANGANA SENIOR LEADERS SHOULD TAKE PART AK

T Congress: కాంగ్రెస్ సీనియర్లతో సరికొత్త యాత్ర.. హైకమాండ్ కొత్త ప్లాన్... కారణం ఇదేనా..?

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)

Congress: ముందుగా నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించడం, వారంతా కలిసి పని చేసేలా చేయడం వంటి అంశాలపైనే కాంగ్రెస్ నాయకత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మరికొద్ది నెలల్లో మునుగోడు ఉప ఎన్నికల, ఆ తరువాత రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్(Congress) నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య ఐక్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సరికొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో బస్సు యాత్ర(Bus Yatra) నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నేతలతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ముందుకు సాగితే.. విపక్షాలను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

    అయితే వారిని ఏకతాటిపైకి తీసుకురావడం పార్టీ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. పార్టీలోని ఎక్కువమంది సీనియర్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి కొందరు నేతలు ఆయనతో పని చేసేది లేదని తెగేసి చెబుతుంటే.. మరికొందరు నాయకులు మాత్రం ఆయన తమను పట్టించుకోకుండా సొంత అజెండాతో ముందుకు సాగిపోతున్నారని కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలిసి ముందుకు సాగేలా చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నేతలతో ఓ బస్సు యాత్ర చేయించాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది.



    నేడో రేపో హైదరాబాద్ రాబోతున్న తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. ఈ అంశంపైనే చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శులు జావెద్, రోహిత్‌.. ఈ అంశంపైనే పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆందోళనతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. ఇక్కడ పరిస్థితిని చక్కబెట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటోంది.

    Telangana : TRS ఎమ్మెల్యే కూతురు పెళ్లికి ఆన్‌లైన్‌లో కట్నాలు వసూలు .. వైరల్ అవుతున్న వాట్సాప్‌ మెసేజ్

    Revanth Reddy : కాంగ్రెస్‌ను ఎవరూ వీడొద్దు .. లీడర్స్ , క్యాడర్‌ని రిక్వెస్ట్ చేస్తున్న రేవంత్‌రెడ్డి వీడియో ఇదే

    ఈ క్రమంలోనే ముందుగా నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించడం, వారంతా కలిసి పని చేసేలా చేయడం వంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. సీనియర్ నేతల్లో ఎక్కువమంది బస్సు యాత్రకు అంగీకరిస్తే.. మిగతా నేతలు కూడా ఇందుకు అంగీకరిస్తారని.. అప్పుడు నేతల మధ్య ఉన్న విభేదాలు తొలిగిపోయేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈ రకమైన ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయని.. కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా మనోధైర్యం పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు