హోమ్ /వార్తలు /తెలంగాణ /

Congress: ఏపీ, తెలంగాణకు కలిపి సూపర్ పీసీసీ.. కాంగ్రెస్ హైకమాండ్ కొత్త ప్లాన్

Congress: ఏపీ, తెలంగాణకు కలిపి సూపర్ పీసీసీ.. కాంగ్రెస్ హైకమాండ్ కొత్త ప్లాన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Congress: టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై తెలంగాణలోని అనేక మంది నేతలు ఖర్గేను కలిసి తమ అభిప్రాయాలను వివరించారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించిన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ దిగజారుతూ వస్తోంది. ఏపీలో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి తలెత్తగా.. తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా తయారవుతోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) డౌన్‌ఫాల్ కొనసాగుతూ వచ్చింది. ఇక 2018 ఎన్నికల తరువాత తెలంగాణలో(Telangana) బీజేపీ బలం పుంజుకుంటుండగా... కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి పడిపోతూ వచ్చింది. ఈ అంశాలపై జాతీయస్థాయిలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టీపీసీసీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంపై ఫోకస్ చేసిన ఖర్గే.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కబెట్టేందుకు అంతకుమించి ఆలోచన చేస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది.

టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై తెలంగాణలోని అనేక మంది నేతలు ఖర్గేను కలిసి తమ అభిప్రాయాలను వివరించారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కీలకమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఖర్గే.. మాణిక్యం ఠాగూర్ స్థానంలో మరో నేతకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నారని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అంతేకాదు తెలంగాణ , ఏపీలో పార్టీ పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న ఖర్గే.. ఈ రెండు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నేతలకు రెండు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను కలిపి చూసేలా ఏ సూపర్ పీసీసీని ఏర్పాటు చేసి.. దానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా పార్టీ బలోపేతానికి సంబంధించి ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోకపోతే.. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని కొందరు నేతలు ఖర్గేకు సూచించడంతో.. ఆయన ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

3 రోజులుగా అజ్ఞాతంలో టీఆర్ఎస్ నేత..సీబీఐ అదుపులో ఉన్నారా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన బొంతు రామ్మోహన్

ఫ్లాష్: కేసీఆర్ కుటుంబంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..నాకేం జరిగిన వారిదే బాధ్యత అంటూ..

దీంతో తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తోంది. ఒకవేళ రెండు రాష్ట్రాలకు కలిపి సూపర్ పీసీసీని కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేస్తే.. దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అప్పుడే కాంగ్రెస్ నేతల్లో చర్చ కూడా మొదలైంది.

First published:

Tags: Congress, Telangana

ఉత్తమ కథలు