Home /News /telangana /

TS POLITICS CONGRESS AND TRS ARE IN TOUGH RACE TO ANNOUNCE CANDIDATE IN MUNUGODU BY ELECTIONS OF TELANGANA AK

Telangana: మునుగోడులో ముందుగా ఆ పని చేయబోయేది ఎవరు ?.. కాంగ్రెస్సా లేక టీఆర్ఎస్సా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Congress| TRS: హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కంటే ముందు టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీసీ నేతకు ఛాన్స్ ఇచ్చింది. కానీ ఈసారి టీఆర్ఎస్ కంటే ముందుగానే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ(BJP) తరపున మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో (Komatireddy Rajagopal Reddy) ఢీ కొట్టబోయే అభ్యర్థి ఎవరనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. మునుగోడులో ఎవరిని బరిలో నిలిపితే బాగుంటుందనే దానిపై కాంగ్రెస్,(Congress) టీఆర్ఎస్‌లు(Trs) అంతర్గతంగా సర్వేలు చేపడుతున్నాయి. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని ఎంపిక చేయాలనే యోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కసరత్తును కూడా చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల్లో ముందు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది.

    నిజానికి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోందని ఈ రెండు పార్టీలు ప్రకటిస్తున్నా.. ఒక పార్టీ అభ్యర్థి ఎంపికకు మరో పార్టీ అభ్యర్థి ఎంపికకు లింక్ ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే.. టీఆర్ఎస్ కూడా అదే దారిలో పయనించే అవకాశం ఉంటుందని టాక్. ఒకవేళ ముందుగా టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించి బీసీకి అవకాశం ఇస్తే.. కాంగ్రెస్ కూడా గులాబీ పార్టీని ఫాలో అయ్యే అవకావం లేకపోలేదనే పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే ఈ రెండు పార్టీల్లో ఎవరు ముందుగా తమ అభ్యర్థిని ప్రకటిస్తారు ?.. ఆ ప్రభావం మరో పార్టీ అభ్యర్థి ఎంపికపై ఏ రకంగా ఉంటుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.



    హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కంటే ముందు టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీసీ నేతకు ఛాన్స్ ఇచ్చింది. కానీ ఈసారి టీఆర్ఎస్ కంటే ముందుగానే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల పోరులో మిగతా పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగింది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారాన్ని కూడా అప్పుడే మొదలుపెట్టింది. అభ్యర్థి ఎంపికతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో ముఖ్యనేతలు పర్యటనలు చేస్తున్నారు.

    Telangana : మునుగోడులో మునుగుడో..? తేలుడో ..? మళ్లీ ఆ మంత్రిపైనే భారమంతా

    Telangana Cabinet Decisions: కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు.. తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

    స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పర్యటనలు చేస్తున్నారు. దీంతో ఈసారి టీఆర్ఎస్ కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే మునుగోడులో బీసీ అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వాలని ఆ పార్టీలో డిమాండ్ పెరుగుతోంది. అయితే గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయాలని మరికొందరు నేతలు భావిస్తున్నారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్‌లో ఎవరు ముందుగా తమ అభ్యర్థిని ప్రకటిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Munugodu By Election, Trs

    తదుపరి వార్తలు