తెలంగాణ (Telangana)లో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ (Marri Sashider Reddy) పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీనితో రాష్ట్రంలో పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. పరిస్థితులు చూస్తుంటే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగం చేసిందనే చెప్పుకోవాలి. కాకపోతే కాషాయ పార్టీ ఈసారి రూట్ మార్చింది. మునుగోడు ఉపఎన్నిక (Munugodu By poll) ముందు టీఆర్ఎస్ నేతలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక మర్రి శశిధర్ రెడ్డి (Marri Sashider Reddy) పార్టీని వీడుతూ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ (Congress) లో కలకలం రేపింది. కాంగ్రెస్ కు క్యాన్సర్ వచ్చిందని ఇప్పట్లో కాంగ్రెస్ (Congress) కోలుకోవడం కష్టమన్నారు. కాంగ్రెస్ (Congress) లో సీనియర్ నాయకునిగా ఉన్న మర్రి తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే కాంగ్రెస్ (Congress) పార్టీలో మరో ఐదుగురు నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
అసంతృప్తితో ఆ ఐదుగురు..త్వరలో బీజేపీలోకి?
ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) పార్టీలో రేవంత్ (Revanth) వర్సెస్ సీనియర్లు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక రేవంత్ కు టీపీసీసీ పదవి ఇవ్వడం సీనియర్లకు అస్సలు నచ్చలేదు. ఈ క్రమంలో వారు ప్రత్యామ్నాయ పార్టీని చూసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీ వైపే అసంతృప్తి నేతలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఐదుగురు నేతలు ఇప్పటికే బీజేపీతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ ఐదుగురు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వారు పార్టీని వీడితే మాత్రం అది తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవాలి.
అప్పుడు టీఆర్ఎస్ ..ఇప్పుడు కాంగ్రెస్..
కాగా గతంలో చేరికలపై టీఆర్ఎస్ (Trs) నేతలను టార్గెట్ చేసిన బీజేపీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. దానికి కారణం లేకపోలేదు. ఒకవేళ టీఆర్ఎస్ (Trs) నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే వారిపై వ్యతిరేకత వుంటుందనే భావనలో కమలం నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ (Congress) నేతలను చేర్చుకుంటే సానుకూల పవనాలు వీస్తాయనే ఆలోచనలో ఉన్నారు. అందుకే బీజేపీ ఆపేరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పుడు టీ కాంగ్రెస్ (Congress) నేతలపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టింది. మరి రానున్న రోజుల్లో బీజేపీ (Bjp)లో చేరే నాయకులూ ఎవరు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Telangana, Telangana News, Trs, TS Congress