హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics: పటాన్‌చెరు టీఆర్ఎస్‌లో రెండు వర్గాలు .. నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఎవరికో ..?

Telangana politics: పటాన్‌చెరు టీఆర్ఎస్‌లో రెండు వర్గాలు .. నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఎవరికో ..?

Patancheru trs(FILE)

Patancheru trs(FILE)

TRS CLASS WAR: పటాన్‌చెరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నెక్స్ట్ టైమ్ గెలుపు సంగతి పక్కన పెడితే..టికెట్‌ విషయంలోనే గట్టి పోటీ తప్పదని ఆయన సొంత వర్గమే చెబుతోంది. నియోజకవర్గంలో అదే పార్టీకి చెందిన నీలం మధు అనే యువ నాయకుడి దూకుడు చూస్తుంటే మహిపాల్‌రెడ్డి సీటుకు ఎర్త్‌ పెట్టే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

(K.Veeranna,News18,Medak)

తెలంగాణ(Telangana)లో ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి కష్టాలు తప్పేలా లేవన్నట్లుగా కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌(TRS)కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ (BJP)ఎదగడం ఇందుకు ఒక కారణమైతే.. గులాబీ పార్టీలోనే గ్రూప్‌ వార్‌ మరో ఎఫెక్ట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్(Medak)జిల్లాలో పది నియోజకవర్గాలుంటే అందులో కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్‌ పట్టునిలుపుకోవడం కష్టమేననే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌(Hyderabad)కు ఆనుకొని ఉన్న పటాన్‌చెరు (Patancheru) నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్‌రెడ్డి (Mahipal Reddy) గెలుపు సంగతి పక్కన పెడితే..టికెట్‌ విషయంలోనే గట్టి పోటీ తప్పదని ఆయన సొంత వర్గమే చెబుతోంది. గత కొద్ది రోజులుగా పటాన్‌చెరు నియోజకవర్గంలో పొలిటికల్ డెవలప్‌మెంట్స్ పరిశీలిస్తే టీఆర్ఎస్‌కు చెందిన నీలం మధు(Neelam Madhu)అనే యువ నాయకుడు దూకుడు పెంచడం మహిపాల్‌రెడ్డి సీటుకు ఎర్త్‌ పెట్టే పరిస్తితి ఉందంటున్నారు స్థానికులు.

Tension : గ్రామస్తుల చేతుల్లో మీ సేవా కేంద్రం ధ్వంసం .. నిర్వాహకుడి ఘనకార్యం వల్లే

పటాన్‌చెరులో పోటాపోటీ..

పటాన్‌చెరు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్‌రెడ్డి మంత్రి హరీష్‌రావు మనిషి. నియోజకవర్గంలో యువత రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ మహిళలకు అవసరమైన మేరకు సాయం చేస్తూ దూసుకుపోతున్న నాయకుడు నీలం మధు మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య పొలిటికల్ రైవలరీ కొనసాగుతోంది. గూడెం మహిపాల్‌రెడ్డి దురుసుతనం, స్థానికుల పట్ల ఒకటి రెండు సార్లు లెక్క చేయకుండా ప్రవర్తించడం ఆయనకు మైనస్‌ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో మహిపాల్‌రెడ్డి అసంతృప్తి నేతలను నీలం మధు కలుపుకుపోవడంతో పాటుగా పలు సామాజిక సేవలతో పాటు అవసరమైతే ఆర్ధిక సాయం చేస్తూ ఆదుకుంటూ వస్తున్నారు.

ఒకే ఒరలో రెండు కత్తులు ...

నియోజకవర్గంలో మహిపాల్‌రెడ్డి గెలుపుపై కాస్త అటు ఇటుగా ఉండటం వల్లే మంత్రి కేటీఆర్ ఆయనకు ప్రత్యామ్నాయంగానే నీలం మధును ఎంకరేజ్ చేస్తున్నారనే టాక్ ఉంది. అందుకే ఓవైపు మంత్రి హరీష్‌రావు అండదండలు ఉన్నాయని తెలిసినప్పటికి మధు కేటీఆర్‌ చొరవతో దూసుకుపోవడం ఇద్దరి మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌గా మారింది. దీంతో రాబోయే ఎన్నికల్లో పటాన్‌చెరు టికెట్ విషయంలో వీళ్లిద్దరిలో అధిష్టానం ఎవరికి పెద్దపీట వేస్తుందో అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.

అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపేనో..

నియోజకవర్గ ఓటర్ల పల్స్‌ పసిగట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తరపున ఆయన సోదరుడు ఇప్పటికే ఇంటింటికి గడపగడప తిరుగుతూ అసంతృప్తి నేతలను మేము ఉన్నామంటూ క్యాడర్‌ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా ఊరికి సీసీ రోడ్డు వేయాలని అడిగేందుకు వచ్చిన మహిళలపై ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి దురుసుగా మాట్లాడి విమర్శల పాలయ్యారు. అదే నియోజకవర్గంలో నీలం మధు ఎన్‌ఎంఎం ట్రస్ట్ పేరుతో నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ తల్లికి 5000 రూపాయల చొప్పున ఫిక్స్‌డిపాజిట్ చేస్తూ మహిళ ఓటర్లను తనవైపు తిప్పుకుంటున్నారు.

YS Sharmila : ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం ముమ్మాటికీ తప్పే : వైఎస్‌ షర్మిల

మార్పు మంచిదే అంటున్న ఓటర్లు..

ఓవైపు సామాజిక సేవ, మరోవైపు నియోజకవర్గంలో పట్టు సాధిస్తున్న నీలం మధు రాబోయే ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గం టీఆర్ఎస్‌ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పార్టీ అధిష్టానం సిట్టింగ్‌కే ప్రాధాన్యత ఇస్తే మధు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకే పక్కా ప్రణాళికతో ఉన్నారని ఆయన వర్గీయులు, నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఈ సంకట పరిస్థితి నుంచి టీఆర్ఎస్‌ హైకమాండ్ ఎలా బయటపడుతుందో చూడాలి. అభ్యర్ధిని మార్చి ఫలితాల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుందో లేక సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చి ప్రయోగం చేస్తుందో చూడాలి అంటున్నారు నియోజకవర్గ ఓటర్లు.

Published by:Siva Nanduri
First published:

Tags: Sangareddy, Telangana Politics, TRS leaders