Home /News /telangana /

TS POLITICS COLLECTION OF MONEY ONLINE IN THE NAME OF SARPANCH FORUM FOR THE MARRIAGE OF MLA DAUGHTER IN KARIMNAGAR DISTRICT SNR KNR

Telangana : TRS ఎమ్మెల్యే కూతురు పెళ్లికి ఆన్‌లైన్‌లో కట్నాలు వసూలు .. వైరల్ అవుతున్న వాట్సాప్‌ మెసేజ్

viral message

viral message

Telangana : ఎమ్మెల్యే కూతురి వివాహానికి కట్న- కానుకలు ఇవ్వాలి ప్రతి ఒక్కరూ తమవంతు వాటాగా డబ్బులు ఫలానా గుగుల్ పే లేదా ఫోన్ పే నెంబర్‌కు పంపండి అంటూ ఒక మెసేజ్‌రెండు మూడు రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India
  (P.Srinivas,New18,Karimnagar)
  ఎమ్మెల్యే(MLA)కూతురి వివాహానికి కట్న- కానుకలు ఇవ్వాలి ప్రతి ఒక్కరూ తమవంతు వాటాగా డబ్బులు ఫలానా గుగుల్ పే(Google Pay)లేదా ఫోన్ పే(Phone Pay)నెంబర్‌కు పంపండి అంటూ ఒక మెసేజ్‌(Message)రెండు మూడు రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే కూతురు వివాహం జరగనున్న నేపథ్యంలో సర్పంచ్‌లు తమ చేయి వేసి బాసటగా నిలవాలన్న సారంశంతో కూడిన ఈ లేఖపై సర్వత్రా చర్చసాగుతోంది. కరీంనగర్(Karimnagar)జిల్లాకు చెందిన ఓ టీఆర్ఎస్‌(TRS MLA)ఎమ్మెల్యే కూతురు వివాహం కోసం కట్నకానుకలు వసూలు చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

  Revanth Reddy : కాంగ్రెస్‌ను ఎవరూ వీడొద్దు .. లీడర్స్ , క్యాడర్‌ని రిక్వెస్ట్ చేస్తున్న రేవంత్‌రెడ్డి వీడియో ఇదే  కొత్త పద్ధతిలో కానుకలు వసూలు..
  కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూతురు వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో సర్పంచ్ రూ . 5,000 ల చొప్పున పంపించాలని ఫోరం తరపున కోరడం జరిగింది. సర్పంచ్‌ల ఫోరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నందున ఫలానా నెంబర్‌కు గూగుల్ పే , ఫోన్ పే ఉందని ప్రతీ సర్పంచ్ 5 వేలు ఇంకా ఎక్కువైన పంపించాలని కూడా సూచించారు. అయి తే ఆ లేఖలో సర్పంచ్‌ల ఫోరం నిర్ణయించిందని పేర్కొంటూనే అభిప్రా యాలు కూడా తెలపాలని కోరడం గమనార్హం.  వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్ ..
  ఈ వ్యవహారంపై కొన్ని మండలాల్లోని సర్పంచ్‌ల ఫోరం మాత్రం ఎమ్మెల్యే కూతురి వివాహానికి కానుకలు ఇచ్చే విషయం గురించి ఎలాంటి అభ్యర్థనలు పెట్టునట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ మండలానికి చెందిన సర్పంచ్‌ను సంప్రదిస్తే తనను మాత్రం ఎవరూ అడగలేదని అన్నారు. దీంతో కొన్ని మండలాలకు చెందిన సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు మాత్రమే అత్యుత్సాహం ప్రదర్శించి నెట్టింట్లో ఈ పోస్టులు పెట్టారా అన్న చర్చ కూడా సాగుతోంది. వివాహానికి ఎవరికి తోచిన విధంగా వారు కట్నాలు చదివిస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఐదు వేలు ఖచ్చితంగా పం పించాలని అడగడంపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

  Cyber crime : టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌ నైనా జైస్వాల్‌కు ఆ టైపు వేధింపులు.. పోకిరిని పట్టుకున్న పోలీసులు


  కల్పితమా లేక నిజమా అనే డౌట్స్..
  నెట్టింట వైరల్ అవుతున్న పోస్టుపై చొప్పదండిలోని కొన్ని మండలాలకు చెందిన కొందరు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రవిశంకర్‌కు సంబంధం లేకుండా కొంతమంది ఇలా పోస్టులు పెట్టి అందరినీ ఇరకాటంలో పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే దగ్గర మంచి పేరు సంపాధించడానికే ఇలా వ్యవహరించడం అవసరమా అని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కరీంనగర్‌లో పనిచేసే పంచాయతీ అధికారి కూతురు పెళ్ళికి వీఆర్‌ఓల నుంచి తహసిల్దార్ వరకు ఎవరికీ తోచిన విధంగా వాళ్లు మేకలు, గొర్రెలు, బంగారం, విలువైన వస్తువులను తీసుకురావాలని అందుకు సంబంధించిన యూనియన్ అధ్యక్షులు హుకుం జరిచేశారు. అప్పుడు తలాకొంత వేసుకొని పెద్ద మొత్తంలో కట్నకానుకలు భారీగానే సమర్పించారు. ఈ వార్త అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేపింది. అదే తీరుగా ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే కుమార్తె వివాహం పేరుతో ఐదు వేలు కట్నం ఇవ్వాలంటూ సర్పంచ్ ఫోరమ్ సంఘం వాట్సాప్ గ్రూపులో రావడం కలకలం సృష్టిస్తోంది.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Telangana News, Telangana Politics

  తదుపరి వార్తలు