ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు చండీగఢ్ (Chandigarh) కు వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శిస్తారు. ఢిల్లీ (Delhi), పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రులతో కలిసి వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ఇరువురు నేతలు చండీగఢ్ పయణమవుతారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంలో ప్రణాలర్పించిన రైతు కుటుంబాలను (Farmers families) సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకుంటారు.
రాజకీయాలే మాట్లాడుతామని..
కాగా, శనివారం దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. సీఎం కేసీఆర్ బృందానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సాదర స్వాగతం పలికారు. అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Chief Minister Arvind Kejriwal )తో కలిసి కేసీఆర్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్ (CM KCR) తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇద్దరు వ్యాపారవేత్తలు కలిస్తే బిజినెస్ గురించే మాట్లాడుకుంటారని అలాగే ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే రాజకీయాలే మాట్లాడుతారని కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా దేశ రాజకీయాల్లో (National Politics) సంచలనాలు నమోదు కాబోతున్నాయని వెల్లడించారు.
అయితే అంతకుముందు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో (akhilesh yadav) కేసీఆర్ భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు ప్రధానంగా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే దేశానికి ప్రత్యామ్నాయ కూటమి వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కలిసి పనిచేసే అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
బీజేపీయేతర పార్టీలతో చర్చలు..
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్న కేసీఆర్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఉన్నారు. చంఢీగడ్‌లో పర్యటన అనంతరం కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్లలో కూడా సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలతో సీఎం చర్చలు జరపనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandigarh, CM KCR, Delhi, Farmers, Politics