Home /News /telangana /

TS POLITICS CM KCR SON KTR MEETING DISSATISFIED LEADERS OF TRS EARLIER PONGULETI SRINIVASA REDDY NOW JUPALLY KRISHNA RAO MKS

TRSలో కొత్త సీన్: KCR అసంతృప్తులకు KTR బుజ్జగింపులు -మొన్న పొంగులేటి, నిన్న జూపల్లితో..

పొంగులేటి, జూపల్లితో కేటీఆర్

పొంగులేటి, జూపల్లితో కేటీఆర్

పార్టీలో ఏళ్లుగా పార్టీలో అవకాశాలు రాక, అధినేత సీఎం కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్న పలువురు నేతలను బుజ్జగించే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలకెత్తుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతిమ నిర్ణేత కేసీఆరే కాబట్టి కొడకు ప్రయత్నాలు ఫలిస్తాయా? అనే చర్చ కూడా ఉంది..

ఇంకా చదవండి ...
అధికార టీఆర్ఎస్ (TRS)లో అసంతృప్త నేతల విషయంలో మునుపెన్నడూ కనిపించని దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ.. ఇష్టంలేని వాళ్లు పోతే పోతారు అన్నట్లుగా వ్యవహరించిన పార్టీ ఇప్పుడు మాత్రం పంథాను మార్చుకున్నట్లు సమాచారం. పార్టీలో ఏళ్లుగా పార్టీలో అవకాశాలు రాక, అధినేత సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తీరుపై గుర్రుగా ఉన్న పలువురు నేతలను బుజ్జగించే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) తలకెత్తుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి, విపక్ష కాంగ్రెస్, బీజేపీ దూకుడు నేపథ్యంలో సీనియర్ నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు తన వంతుగా కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు జరుగుతోన్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్న కేటీఆర్.. ఎక్కడికక్కడ అసంతృప్తనేతలతో ప్రత్యేక మంతనాలు జరుపుతూ, అంతర్గత విభేదాలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అల్టిమేట్ నిర్ణేత కేసీఆరే కాబట్టి కేసీఆర్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయనే చర్చ కూడా జరుగుతోంది.

Ayyanna Patrudu : పులివెందుల పిల్లి భయపడింది.. ఇక చంపడమే మిగిలింది : టీడీపీ ఫైర్


తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం నాడు నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం జిల్లాకే చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు జూపల్లి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారని, బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. జూపల్లి ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్ సమస్యను పరిష్కరించే యత్నం చేసినట్లు తెలుస్తోంది.జూపల్లితో మాట్లాడిన కేటీఆర్ ప్రధానంగా కొల్లాపూర్‌లో పార్టీ పరిస్థితి, గ్రూప్‌ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. గతంలో సీఎం కేసీఆర్ పాల్గొన సభకు సైతం గైర్హాజరైన జూపల్లి.. నిజానికి నిన్నటి కేటీఆర్‌ పర్యటనకు సైతం దూరంగా ఉన్నారు. అయితే కేటీఆరే చొరవతీసుకొని మరీ జూపల్లి ఇంటికెళ్లి చాయ్ పే చర్చలు చేశారు. జూపల్లికి, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మధ్య విభేధాల నేపథ్యంలో పార్టీ మారకుండా నిలువరించడంతో పాటు టీఆర్‌ఎస్‌లో వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకే కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది.

Ayyanna Patrudu : ఏపీలో బుల్డోజర్!! -అయ్యన్న ఇంటిగోడ కూల్చివేత -ఏ క్షణమైనా అరెస్ట్!


తాజాగా మంత్రి కేటీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటనలోనూ అసంతృప్త నేత పొంగులేటి శ్రీనివాసరావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూపల్లి మాదిరిగా పొంగులేటి పార్టీ కార్యక్రమాలకు దూరంగా వ్యవహరించనప్పటికీ, ఆయనకు సరైన అవకాశాలు దక్కడంలేదనే భావన సర్వత్రా ఉంది. ఖమ్మంలో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న బీజేపీ.. పొంగులేటిపై కన్నేసిందని, శ్రీనివాస రెడ్డి సోదరుడు, ఇప్పటికే బీజేపీలో ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి ద్వారా మంతనాలు చేయిస్తోందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి కొద్ది రోజులకే టీఆర్ఎస్ లో చేరినా.. తర్వాతి కాలంలో ఏనాడూ ఆయనకు కారు గుర్తుపై లేదా గులాబీ సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే దక్కలేదు. వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పొంగులేటికి కచ్చితంగా టికెట్ దక్కుతుందనే సంకేతాలు కూడా వెలువడలేదు. దీంతో ఆయన సొంత దారి చూసుకోవచ్చనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం ప్రస్తుతానికి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. కేటీఆర్ తో చర్చల్లోనైనా పొంగులేటికి కచ్చితమైన హామీ లభించిందీ లేనిది వెల్లడికాలేదు.

PJR Daughter Vijaya Reddy : టీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి విజయారెడ్డి


టీఆర్ఎస్ పుట్టి 22 ఏళ్లు పూర్తికాగా, ఇప్పటికి ఎంతో మంది నేతలు వెళ్లిపోయానా బుజ్జగింపు యత్నాలు జరగడం మాత్రం దాదాపు అరుదు. ఆయా నియోజకవర్గాల్లో నేతల బలాబలాపై ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇచ్చిన సర్వే రిపోర్టుల నేపథ్యంలోనే కేటీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఇతర జిల్లాల్లోని అసంతృప్త నేతలనూ ఆయన కలుస్తారని వినికిడి. అయితే, టీఆర్ఎస్ లో అల్టిమేట్ నిర్ణేత కేసీఆరే కాబట్టి కేసీఆర్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి..
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Khammam, KTR, Minister ktr, Nagarkarnol district, Trs

తదుపరి వార్తలు