Home /News /telangana /

TS POLITICS CM KCR SAYS PEOPLE SHOULD THINK OF TELANGANA DEVELOPMENT AND WILL NOT GO SIDEWAYS IN MEDCHAL AK

CM KCR in Medchal: మోసపోతే మళ్లీ గోసపడతాం.. వాళ్ల మాటలు నమ్మొద్దన్న కేసీఆర్..

మేడ్చల్ సభళో కేసీఆర్

మేడ్చల్ సభళో కేసీఆర్

KCR| Medchal: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం తెలంగాణలో ఉందని ఆయన చెప్పారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని.. ఇలాంటి సమయంలో ఎవరో చెప్పిన మాటలు విని మోసపోతే మళ్లీ గోసపడతామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం తెలంగాణలో(Telangana) ఉందని ఆయన చెప్పారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ (KCR).. అనంతరం జరిగిన సభలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, ఈ విషయం పదే పదే చెప్పడానికి కారణం ఉందన్నారు. హైదరాబాద్‌లో కరెంటు పోదు.. అదే దేశరాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంటు రాదని వ్యాఖ్యానించారు. దేశంలో పరిస్థితి ఇలాగే ఉందని.. అందుకే ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నానని అన్నారు.

    ఒకప్పుడు మంచి నీళ్ల కోసం నానా తంటాలు పడేవాళ్లమని... ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఒకప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం కేవలం రూ.లక్షగా ఉండేదని... ఇప్పుడు ఇండియాలో నెంబర్‌వన్‌గా రూ.2,78,500కు పెరిగిందని అన్నారు. ఈ విషయంలో మనకన్నా ముందుండే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లను దాటి ఈ ఘనత సాధించామని అన్నారు. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందడం చూసి దేశమంతా ఆశ్చర్యపోతుందని కేసీఆర్ అన్నారు. చేనేత, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు ఇలా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు.



    తెలంగాణ జీఎస్‌డీపీ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.5 లక్షలకోట్లు ఉండేదని.. నేడు అది రూ.11.5 లక్షలకోట్లకు చేరిందని కేసీఆర్ తెలిపారు. దేశంలోనే అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణే అని అన్నారు. వీటిలో చదువుకుంటున్న పేద విద్యార్థులు దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు సాధిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా రాకుంటే మరిన్ని గురుకులాలు పెంచేవాళ్లమని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ల కొరత కూడా తీర్చుకున్నామని... ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి కూలీల కోసం పోయేవారని.. ఇప్పుడు పన్నెండు రాష్ట్రాల నుంచి ఇక్కడకు బతుకుతెరువు కోసం వస్తున్నారని కేసీఆర్ తెలిపారు.

    Madhu Yashki: కాంగ్రెస్ కీలక భేటీకి మధుయాష్కీ డుమ్మా.. ఠాగూర్ సీరియస్.. అదే కారణమా ?

    KCR: కేసీఆర్ 'మునుగోడు' ఫ్లాన్ రెడీ.. ఆ నినాదంతోనే బీజేపీకి చెక్ చెప్పాలని నిర్ణయం ?

    వాళ్లందరికీ పని కల్పించే అద్భుతమైన రాష్ట్రంగా మనం ఎదిగామని గుర్తు చేశారు. ఉద్యమకాలంలో ఏది కావాలని కోరుకున్నామో అది సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. ఈ ప్రగతి కొనసాగాలని.. విచ్ఛిన్న శక్తులు, దుర్మార్గులు దీన్ని చెడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. వారి మాటలు విని పోసపోవద్దని.. ఎవరు ఏం చెబుతున్నారనే విషయాలను విని వదిలేయకుండా వాటి గురించి చర్చించాలని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు