హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kcr Press meet: సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్..కీలక విషయాలు వెల్లడించే ఛాన్స్

Kcr Press meet: సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్..కీలక విషయాలు వెల్లడించే ఛాన్స్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగానే TRS (తెలంగాణ రాష్ట్ర సమితి)ని BRS (భారత్ రాష్ట్రీయ సమితి)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. అందరూ అనుకున్న విధంగానే TRS (తెలంగాణ రాష్ట్ర సమితి)ని BRS (భారత్ రాష్ట్రీయ సమితి)గా మారుస్తూ అధికారిక ప్రకటన చేశారు. దీనితో టీఆర్ఎస్ ఇక బిఆర్ఎస్ గా మారబోతుంది. కేసీఆర్ ప్రకటనతో 21 ఏళ్ల టిఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చేసుకుంది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా పేరు మార్పు చేశారు. ఇక సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

  సీఎం కేసీఆర్ సంచలన ప్రకటనతో రాజకీయాల్లో మరో నూతన అధ్యాయం ఏర్పడింది. ఇక జాతీయ పార్టీకి సంబంధించి లీగల్ అంశాలను భారత ఎన్నికల సంఘంముందు ప్రవేశపెట్టనుంది. ఈ ప్రక్రియ మొత్తం వారం రోజుల్లో పూర్తయ్యేలా కనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రకటనతో తెలంగాణ , ఏపీ, తమిళనాడు , మహారాష్ట్ర రాష్ట్రాల్లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఇక ఇప్పటివరకు కేవలం తెలంగాణలోనే చక్రం తిప్పిన కేసీఆర్ ఇప్పుడు నేషనల్ లెవల్ లో పట్టు సాధించాలని చూస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా ఏర్పడింది.

  Published by:Rajasekhar Konda
  First published:

  ఉత్తమ కథలు