Home /News /telangana /

TS POLITICS CM KCR MINISTER ERRABELLI DAYAKAR RAO BROTHER PRADEEP RAO RESIGNS TRS LIKELY TO JOIN BJP ON AUGUST 7 AT AMIT SHAH MKS

TRS | BJP : బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు.. 7న అమిత్ షా సమక్షంలో!

కేసీఆర్, దయాకర్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు (పాత ఫొటోలు)

కేసీఆర్, దయాకర్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు (పాత ఫొటోలు)

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసిన సమయంలోనే ప్రదీప్ రావు సైతం టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరూ ఈనెల 7న ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

తెలంగాణ (Telangana)లో అధికార సాధనే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తోన్న బీజేపీ (BJP).. ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించగా, మరోవైపు, ఏకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు (Errabelli Pradeep Rao) సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ సొంత కులానికి చెందిన నేత కావడంతో టీఆర్ఎస్ కు ఎర్రబెల్లి రాజీనామా, బీజేపీలో చేరికకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్‌ఎస్ కు రాజీనామా చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిగ్గా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసిన సమయంలోనే ప్రదీప్ రావు సైతం టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరూ బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. కోమటిరెడ్డితోపాటే ప్రదీప్ రావు సైతం ఈనెల 7న ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

Nancy Pelosi | Taiwan : తైవాన్‌పై China యుద్ధ శంఖం.. చిచ్చురేపిన అమెరికా స్పీకర్ పర్యటన..


వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో ఏర్పడిన విభేదాలకు తోడుగా, తన సోదరుడు టీఆర్‌ఎస్ లో కీలకంగా మారడం, మంత్రివర్గంలో ఉండడంతో తనకు రావాల్సిన పదవులు, టికెట్లు రావడం లేదనే భావనలో ప్రదీప్ రావు ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్‌ ఆశించిన ప్రదీప్ రావును ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీతో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం బుజ్జగించింది. ఆ టికెట్‌ దక్కించుకున్న నన్నపునేని నరేందర్‌ ఎన్నికల్లో గెలిచారు. ఈ తరుణంలో టీఆర్‌ఎస్‌లో తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే కారణంతోనే ప్రదీప్ రావు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Nethanna Beema : దేశంలోనే తొలిసారి.. రైతు బీమా తరహాలో చేనేత కుటుంబాలకు రూ.5లక్షలు : KTR


నిజానికి, పది రోజుల కిందట హైదరాబాద్‌లో వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌... ప్రదీప్ రావును ఉద్దేశిస్తూ ఎమ్మెల్యేతో సర్దుకుపోవాలని సూచించడంతో ఈసారి కూడా తనకు టికెట్‌ రాదని గ్రహించిన తర్వాతే పార్టీ మారాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్‌ బృందం ప్రదీప్ రావుతో పలు దఫాలుగా చర్చలు జరిపి పార్టీలో చేరికకు లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలిసింది. ప్రదీప్‌రావు బుధవారం ముఖ్య కార్యకర్తలతో చర్చల అనంతరం రాజీనామాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Errabelli Dayakar Rao, Telangana, Trs, Warangal

తదుపరి వార్తలు