Home /News /telangana /

TS POLITICS CM KCR MAY RETURN HYDERABAD FROM DELHI AFTER DENTAL TREATMENT WHILE TRS PLANS FOR DHARNA AT DELHI ON APRIL 11 MKS

CM KCR: పన్ను పీకించుకొని కేసీఆర్ తిరుగుటపా! -ఢిల్లీ వరి దీక్షకు సీఎం పక్కాగా వెళతారా?

ఢిల్లీలో కేసీఆర్(ఆదివారం నాటి ఫొటోలు)

ఢిల్లీలో కేసీఆర్(ఆదివారం నాటి ఫొటోలు)

పంటి నొప్పితో బాధపడుతోన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్ తిరిగొస్తారని తెలుస్తోంది. ఆరోగ్యం పూర్తిగా సహకరించకుంటే 11న ఢిల్లీలో టీఆర్ఎస్ తలపెట్టిన వరి దీక్షలో సీఎం కచ్చితంగా పాల్గొంటారా? లేదా? అనే మీమాంస ఏర్పడింది.

తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొనేలా ప్రధాని మోదీ మెడలు వంచుతామంటూ శపథం చేసి ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. పర్యటన మధ్యలోనే తిరుగుటపా కట్టనున్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. వారంపాటు అక్కడే ఉండి, ఈనెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ తలపెట్టిన వరి దీక్షలో పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, కేసీఆర్ హస్తిన పర్యటన కేంద్రంపై పోరులో భాగంగా కాదని, వ్యక్తిగతమని, దంత చికిత్స కోసమే ఆయన ఢిల్లీ వచ్చారని ఆలస్యంగా వెల్లడైంది. ప్రస్తుతం పంటి నొప్పితో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్ తిరిగొచ్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం పూర్తిగా సహకరించకుంటే 11న ఢిల్లీ దీక్షలో సీఎం కచ్చితంగా పాల్గొంటారా? లేదా? అనే మీమాంస ఏర్పడింది. సకల సౌకర్యాల భాగ్యనగరిలో కాకుండా హస్తినలో కేసీఆర్ చికిత్స తీసుకుంటుండటంపైనా విమర్శలు వస్తున్నాయి.

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై పోరులో భాగంగా టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు బుధవారం నాడు తెలంగాణలోని జాతీయ రహదారులను దిగ్బంధించనున్నారు. నాగపూర్‌, బెంగళూరు, విజయవాడ, ముంబై హైవేలపై టీఆర్ఎస్ రాస్తారోకోలు చేపట్టనుంది. అయితే, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించొద్దని హైకోర్టు ఆదేశించింది. వరిపోరులో చివరి అంకంగా టీఆర్ఎస్ ఈనెల 11న ఢిల్లీలో భారీ దీక్ష చేయనుంది. ఆ దీక్షలో సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ బాధ్యులు అంతా కలిపి వేల సంఖ్యలో హాజరవుతారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఆదివారమే ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ 11వరకూ అక్కడే ఉంటారని అంతా భావించినా, ఆయన మాత్రం బుధవారమే హైదరాబాద్ తిరగొచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది.

Jogipet జాతిరత్నాలు: తాగిన మైకంలో అబ్బాయికి తాళి కట్టాడు.. వాడేమో కాపురం చేస్తానని ఇంటికొచ్చాడు!


ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ పంటి చికిత్స చేయించుకున్నారు. పర్యటన మూడోరోజునా తుగ్లక్‌ రోడ్డులో విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఆయన మరోసారి దంత వైద్యుడి వద్దకెళ్లారు. పన్ను పీకించుకోవడంతో ఆయన నొప్పితో బాధపడుతున్నారని, విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. సోమవారం సీఎంను పార్టీ ఎంపీలు కొందరు కలిశారని, మంగళవారం మాత్రం కేసీఆర్ ఎవరినీ కలవలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పంటి నొప్పి తగ్గితే బుధవారం హైదరాబాద్‌ వెళ్లే అవకాశాలున్నాయని ఆ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

Srilanka Crisis: ఎమర్జెన్సీ ఎత్తివేత.. నిరసనలు ఉధృతం.. చైనా వల్లే శ్రీలంకలో ఆకలి కేకలు!


పన్ను పీకించుకున్న తర్వాత నొప్పితో బాధపడుతోన్న కేసీఆర్ నేడు హైదరాబాద్ తిరిగిరానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆరోగ్యం పూర్తిగా కుదుటపడితేనే కేసీఆర్ 11న ఢిల్లీలో జరిగే దీక్షలో పాల్గంటారా? ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా రిస్క్ చేసి మళ్లీ ఢిల్లీకి వెళతారా? అని చర్చ జరుగుతోంది. బీజేపీపై వరి పోరులో ఢిల్లీ దీక్షను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దరిమిలా కేసీఆర్ తప్పక హాజరవుతారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే,

Sunil Kanugolu: డైలమాలో ప్రశాంత్ కిషోర్.. శిష్యుడు సునీల్ కనుగోలు దూకుడు.. కాంగ్రెస్‌లో చేరిక


చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి చికిత్స చేయించుకోవడంపై ఇటీవల సోషల్ మీడియాలో, బయటా చర్చ జరుగుతోంది. మెడికల్ సౌకర్యాలకు సంబంధించి హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి చెంది, దేశ విదేశాల నుంచి వేల మంది హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటోంటే కేసీఆర్, ఆయన కుటుంబీకులు మాత్రం ఢిల్లీ వెళ్లడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Delhi, Paddy, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు