హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : కేసీఆర్ వ్యూహం మారిందా? BRSకు బైబై.. TRSపైనే ఫోకస్ -20 నుంచి జిల్లాల పర్యటన!

CM KCR : కేసీఆర్ వ్యూహం మారిందా? BRSకు బైబై.. TRSపైనే ఫోకస్ -20 నుంచి జిల్లాల పర్యటన!

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

టీఆర్ఎస్ ను జాతీయ స్థాయికి విస్తరించి, బీఆర్‌ఎస్‌ గా మార్చే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, ముందుగా ఇంటిని చక్కదిద్దుకుంటూ పార్టీలో, పాలనపై నెలకొన్న అసంతృప్తిని చల్లార్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..

బీజేపీని బంగాళాఖాతంలో కలిపేలా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీ (KCR National Party) పెట్టాలనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ప్రస్తుతానికి వ్యూహం మార్చుకున్నారా? రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు బైబై చెప్పి కేవలం టీఆర్ఎస్ (TRS)పైనే ఫోకస్ పెంచనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు తప్పవనే అంచనాల నడుమ అధికార పార్టీలోని అసంతృప్తులు పెద్ద ఎత్తున జంపింగ్‌లు చేస్తుండటం, సంక్షేమ పథకాల నత్తనడక కారణంగా ప్రజల్లో పెరుగుతోన్న అసంతృప్తి, దాదాపు అన్ని జిల్లాల్లో అంతర్గత కుమ్ములాటలు, సాధారణంగానే ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత.. తదితర అంశాల నేపథ్యంలో ముందుగా ఇంటిని చక్కబెట్టుకోవాలని, ఆ తర్వాతే బీఆర్ఎస్ సంగతి చూడాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Jagananna Vidya Kanuka : నేడే స్కూళ్ల రీఓపెనింగ్ -విద్యా దీవెన పంపిణీ -ఆదోనిలో సీఎం జగన్ సభ


టీఆర్ఎస్ ను జాతీయ స్థాయికి విస్తరించి, బీఆర్‌ఎస్‌ గా మార్చే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, ముందుగా ఇంటిని చక్కదిద్దుకుంటూ పార్టీలో, పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే దిశగా అడుగులు వేయాలని సీఎం కేసీఆర్.. ప్రజాప్రతినిధులు, నేతలకు సంకేతాలు ఇచ్చారంటూ ‘ఆంధ్రజ్యోతి’ ఓ సంచలన కథనం రాసింది. బీఆర్ఎస్ కంటే ముందు టీఆర్ఎస్ ను బాగు చేసుకుందామంటూ ప్రగతిభవన్‌లో ఇటీవల తన తో సమావేశమైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిర్దేశం చేసినట్లు వెల్లడైంది.

Gold Silver Rates: పసిడి రేటు భారీగా పెరగనుందా? -ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంతంటే..


టీఆర్ఎస్ నుంచి కీలక పదవుల్లో ఉన్నవారు, మాజీ ప్రజాప్రతినిధులు ఇటీవల కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోకి వెళుతుండటం, రాబోయే రోజుల్లో వలసలు పెరగొచ్చనే అంచనాల నడుమ ఇంటిని చక్కబెట్టుకునే దిశగా సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనను ఈ నెల 20 అనంతరం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలకు సమయం ఇవ్వనున్నట్లు తెలిసింది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు విజయావకాశాలపై ప్రభావం చూపే పరిస్థితులు ఉండటంతో వాటిని చక్కదిద్దే బాధ్యతను కేసీఆర్ స్వయంగా తీసుకోనున్నట్లు సమాచారం.

Maharashtra : షాకిచ్చిన పవార్ -కూలనున్న షిండే సర్కార్.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు!


తెలంగాణ కొత్త అప్పులకు కేంద్రం మోకాలడ్డడంతో సంక్షేమ పథకాల అమలుకూ కటకట ఏర్పడటం, ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితి నెలకొనడంతో సర్వత్రా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తిని సెంటిమెంట్‌తో అధిగమించాలన్న ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చారనే భావన కూడా ఉంది. ఈ వ్యూహం పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందం సర్వేల్లో తేలిందని, పీకే రిపోర్టుల క్రమంలోనే కేసీఆర్ వ్యూహాలను మార్చుకున్నారని తెలుస్తోంది.

Modi | BJP : మోదీ కంటే కేసీఆరే సీనియర్.. బండి నెత్తిన రూ.100 పెట్టినా రూ.1కి కొనరు : TRS


రాబోయే రోజుల్లో పూర్తిగా టీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టనున్న కేసీఆర్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వడివడిగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బులు, 57 ఏళ్లు నిండినవారికి పింఛన్లు తదితరాలను ఈ ఆగస్టు నుంచే విడుదల చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో పెరిగిన భూ సమస్యలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో వాటి పరిష్కారంపైనా సీఎం దృష్టిసారించినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సు లు పెట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలో ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్యల పరిష్కారం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: CM KCR, Telangana, Trs

ఉత్తమ కథలు