Home /News /telangana /

TS POLITICS CM KCR MAY FIELD EX MP BURA NARSAIAH GOUD IN MUNUGODU BY ELECTIONS TO TAKE ON BJP CONGRESS AK

KCR| Munugodu: టీఆర్ఎస్ ‘మునుగోడు’ రేసు.. కేసీఆర్ పరిశీలనలో మరో కొత్త పేరు ?

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

మునుగోడు, కేసీఆర్ (ఫైల్ ఫోటో

TRS| Munugodu: బూర నర్సయ్యగౌడ్ గతంలో భువనగిరి ఎంపీగా వ్యవహరించారు. మునుగోడు నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు మునుగోడు(Munugodu) చుట్టే తిరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇక బీజేపీకి దక్కకుండా ఈ సీటును తమ సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ (TRS) కూడా తీవ్రమైన కసరత్తు మొదలుపెట్టింది. హుజూరాబాద్ తరహాలో ఈ సీటు బీజేపీ ఖాతాలోకి వెళితే..ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనే టెన్షన్‌లో ఉన్న టీఆర్ఎస్.. ఈ సీటును ఎలాగైనా గెలుచుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) చేతిలో ఓడిపోయారు. దీంతో ఉప ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తోంది టీఆర్ఎస్. బీసీ నాయకులుగా ఉన్న కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్ పేర్లను పరిశీలిస్తోంది టీఆర్ఎస్.

    అయితే తాజాగా ఈ రేసులో మరో బీసీ నాయకుడు కూడా చేరిపోయారనే వాదన వినిపిస్తోంది. భువనగిరి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేరును కూడా టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోందని సమాచారం. బూర నర్సయ్యగౌడ్ గతంలో భువనగిరి ఎంపీగా వ్యవహరించారు. మునుగోడు నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.



    దీంతో అక్కడ ఆయనకు పరిచయాలు ఉన్నాయి. దీనికి తోడు అక్కడ గౌడ సామాజికవర్గం ఓట్లు, ఇతర బీసీ వర్గం ఓట్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటంతో బూర నర్సయ్య గౌడ్‌ను పోటీలో దింపాలనే ఆలోచన టీఆర్ఎస్ నాయకత్వానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. కర్నాటి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ ముగ్గురు బీసీ నాయకులే కావడంతో.. వీరిలో టీఆర్ఎస్ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనే చర్చ జోరుగా సాగుతోంది.

    Congress| Munugodu: మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు.. ఆ నలుగురిపైనే సర్వే ?

    BJP | Jayasudha : బీజేపీలోకి సహజనటి .. ఆ రోజునే జయసుధ పార్టీలో చేరడం ఖాయమని సంకేతాలు

    మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని టీఆర్ఎస్ నాయకత్వం తమ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేస్తుందని.. అంతకంటే ముందు వీరికి సంబంధించిన నియోజకవర్గ స్థాయిలో ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఇందుకు సంబంధించి రెండు మూడు నివేదికలు తెప్పించుకున్న తరువాతే అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే బూర నర్సయ్య గౌడ్ పేరు కూడా మునుగోడు విషయంలో పరిశీలనలోకి రావడం కొత్త పరిణామంగా తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Munugodu By Election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు