Home /News /telangana /

TS POLITICS CM KCR MADE SENSATIONAL COMMENTS ON PM THAT NARENDRA MODI IS ACTING LIKE A SALESMAN INSTEAD OF THE PRIME MINISTER OF THE COUNTRY PRV

Telangana CM KCR: మోదీ ప్రధానిలా కాకుండా సేల్స్​మెన్​లా మారారు.. పీఎంపై సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్, పీఎం మోదీ (పాత ఫొటోలు)

సీఎం కేసీఆర్, పీఎం మోదీ (పాత ఫొటోలు)

తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. శనివారం తెలంగాణకు విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా వచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన సభలో కేసీఆర్​ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

  తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)​ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi)పై విమర్శలు గుప్పించారు. శనివారం  విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా (Yashwant Sinha) తెలంగాణ (Telangana)కు వచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన సభలో కేసీఆర్​ కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మేకిన్​ ఇండియా (make in India) ద్వారా ఏమైనా చేశారా.. ఏమైనా వచ్చాయా? పోయాయా? అని ప్రశ్నించారు. మోదీపై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష్యలు లేవని ఈ సందర్భంగా కేసీఆర్​ అన్నారు.  రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు ​. మోదీ దేశం ముందు తలదించుకున్నారంటూ కేసీఆర్​ వ్యాఖ్యానించారు. స్విస్​ బ్యాంకు నుంచి ఎన్ని డబ్బులు ఇండియాకు తిరిగి వచ్చాయని పీఎం​ మోదీని ప్రశ్నించారు. మోదీ దేశానికి ప్రధానిలా (Prime minister) కాకుండా సేల్స్​మ్యాన్​లా (Salesman) వ్యవహరిస్తున్నారని కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవ్వాళ మోదీ హైదరాబాద్ (Hyderabad) వస్తున్నారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. ప్రధాని ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని అడిగారు​.  అడ్డికి పావుసేరు ధర పెట్టి బయటనుంచి బొగ్గు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు కేసీఆర్.  సింగరేణి బొగ్గు రూ. 4 వేలకు టన్నయితే, విదేశీ బొగ్గు రూ. 30 వేలు ఉందని సీఎం​ గుర్తుచేశారు.

  విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి (Opposition presidential candidate) గురించి మాట్లాడుతూ.. యశ్వంత్​ సిన్హా లాయర్ వృత్తితో తన జీవితం ప్రారంభించారని, విదేశాంగ శాఖామంత్రిగా విదేశాల్లో సైతం మంచి గుర్తింపు సాధించారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోని ఓటు వేయాలని కోరుతున్నానని అన్నారు. ఇద్దరు ప్రెసిడెంట్ అభ్యర్థుల పనితీరు, తేడా ఒకసారి ఓటర్లు గమనించాలి. దేశంలో జరుగుతున్న విషయాలపై ప్రతీ ఒక్కరూ గొంతు ఎత్తాలి. దేశంలో కొత్త పరివర్తన రావాలి అని అన్నారు కేసీఆర్​.  వేడెక్కిన రాజకీయాలు..

  తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National executive meeting 2022) జరగనున్నాయి. పార్టీ విస్తరణ, మోదీ పాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేదుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ (Hyderabad)లో సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా (JP Nadda) వంటి అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ సీఎంలంతా హాజరవుతున్నారు. ఇవాళ మాదాపూర్ హెచ్ఐసీసీలో కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం అంతా సిద్ధం చేశారు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు. కనివినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేసేందుకు కమలం నేతలు కంకణం కట్టుకున్నారు.

  పెద్ద ఎత్తున గులాబీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్..

  కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం... బీజేపీకి కౌంటర్ ఇచ్చేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున గులాబీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బీజేపీ కూడా భారీగా ఫ్లెక్సీలు పెట్టింది. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలతో నగరం మొత్తం కాషాయం, గులాబీ రంగులను పులుముకుంది. బీజేపీ కార్యవర్గ సమావేశాలను తక్కువ చేసి చూపించే క్రమంలోనే... టీఆర్ఎస్ కూడా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చేస్తున్న రోజే.. నగరంలో భారీ ర్యాలీని తలపెట్టింది. ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగడానికి కొన్ని గంటల ముందే.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత సిన్హా (Yashwant Sinha) కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: BJP National Executive Meeting 2022, CM KCR, PM Narendra Modi, Politics, President Elections 2022

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు