Home /News /telangana /

TS POLITICS CM KCR LED TRS FORMATION DAY CELEBRATIONS TO BE HELD AT HICC ON APRIL 27 DETAILS HERE MKS

TRS Formation Day: 27న కేసీఆర్ యుద్దభేరీ -హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవస్థాపక వేడుక

కేసీఆర్

కేసీఆర్

టీఆర్ఎస్ లో పండుగ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ఏప్రిల్ 27వ తేదీన నిర్వహిద్దామంటూ గులాబీ బాస్, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కార్యక్రమ విశేషాలివే..

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ఏప్రిల్ 27వ తేదీన నిర్వహిద్దామంటూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. టీఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 27న హైదరాబాద్ లోని మాదాపూర్‌లో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో జరుగనున్నాయి. 27న ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు హెచ్ఐసీసీకి చేరుకోవాల‌ని పార్టీ ప్ర‌తినిధులంద‌రికీ సీఎం సూచించారు.

టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు హైదరాబాద్ లో నిర్వహించే ప్రధాన స‌మావేశానికి రాష్ట్ర మంత్రివ‌ర్గంతో పాటు లోక్‌స‌భ‌, రాజ్యస‌భ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేష‌న్ల చైర్మ‌న్‌లు, జిల్లాల పార్టీ అధ్య‌క్షులు, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్య‌క్షులు, జిల్లా గ్రంథాల‌యాల సంస్థ అధ్య‌క్షులు, జిల్లా రైతుబంధు స‌మితి అధ్య‌క్షులు, మ‌హిళా కోఆర్డినేట‌ర్లు, జ‌డ్పీటీసీ స‌భ్యులు, మున్సిప‌ల్ మేయ‌ర్లు, చైర్మ‌న్లు, మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షులు, ప‌ట్ట‌ణాల‌, మండ‌లాల పార్టీ అధ్య‌క్షులు, వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్లు హాజ‌రు కానున్నారు. ప్ర‌త్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రవుతారు.

శిష్యుడు KCRకు స్పాట్ పెడుతోన్న Chandrababu -రూ.2లక్షల అస్త్రం.. టీటీడీపీనే ప్రత్యామ్నాయం!


ఈనెల 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవ షెడ్యూల్ ను పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పార్టీ ప్ర‌తినిధుల పేర్ల న‌మోదు కార్య‌క్ర‌మం కొన‌సాగనుంది. ఉద‌యం 11:05 గంట‌ల‌కు పార్టీ అధ్య‌క్షులు కేసీఆర్ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకుని, పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం స్వాగ‌తోప‌న్యాసం ఉంటుంది. ఆ త‌ర్వాత అధ్య‌క్షుడు కేసీఆర్ మాట్లాడుతారు. దాదాపు 11 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. తీర్మానాల‌ను చ‌ర్చించి ఆమోదం తెలుప‌నున్నారు.

CM KCR: కేసీఆర్ దూకుడు.. మళ్లీ ఢిల్లీకి.. ఈసారి లఖీంపూర్ ఖేరీ సందర్శన.. బీజేపీపై పోరు ఉధృతం!


వరి వివాదం, వ్యవసాయం, కరెంటు, విభజన హామీలు తదితర అంశాల్లో కేంద్రంలోని బీజేపీపై ఇప్పటికే టీఆర్ఎస్ పోరుబాటలో పయనిస్తుండగా, యుద్దాన్ని మరింత ఉధృతం చేస్తూ గులాబీ దళపతి రణభేరి మోగించనున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశంలో ఇప్పటికే ఓసారి ఢిల్లీలో దీక్ష చేసొచ్చిన సీఎం కేసీఆర్ మరోసారి రైతుల అంశాలే ప్రాతిపదికన హస్తినలో పర్యటిస్తారని, ఉత్తరప్రదేశ్ లో రైతులపై హింసాకాండ చోటుచేసుకున్న లఖీంపూర్ ఖేరీని సందర్శిస్తారని తెలుస్తోంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ముందే కేసీఆర్ ఢిల్లీ వెళతారా లేక వేడుక ముగిసిన తర్వాత వెళతారా అనేదానిపై స్పస్టత రావాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Hyderabad, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు