హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..కేంద్రంపై కొట్లాటకు గులాబీ దళపతి సై..కానీ ఎలాగంటే?

Breaking News: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..కేంద్రంపై కొట్లాటకు గులాబీ దళపతి సై..కానీ ఎలాగంటే?

కేంద్రంపై కేసీఆర్ కొట్లాట

కేంద్రంపై కేసీఆర్ కొట్లాట

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీరును ఎండగట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశాల్లో కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించనున్నారు. అలాగే అభివృద్ధికి కేంద్రం అడ్డుగా ఉంటుందని సమావేశాల్లో చర్చించనున్నారు. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీరును ఎండగట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశాల్లో కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించనున్నారు. అలాగే అభివృద్ధికి కేంద్రం అడ్డుగా ఉంటుందని ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ (Cm Kcr) భావిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుంది. రాష్ట్రానికి రావాల్సిన రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమే. అందుకే కేంద్రం వైఖరిని ఎండగడుతూ..ఈ సమావేశాలు జరగాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ (Cm Kcr) ఆదేశాలు జారీ చేశారు.

  Telangana: మల్లారెడ్డి నివాసాల్లో ఐటీ రైడ్స్ పై బండి సంజయ్ , లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..

  కేంద్రంపై కొట్లాటకు సై..

  రాష్ట్రంలో తాజా రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా సిట్యుయేషన్ మారిపోయింది. ఇక రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల రైడ్స్ తో కేసీఆర్ అలెర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తరువాత ఒకటి రెండు సార్లు మాట్లాడి సైలెంట్ అయ్యారు. మునుగోడు గెలుపుతో ప్రజలు తమవైపు ఉన్నారనే ధీమాతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా కేసీఆర్ నిర్ణయం ఇప్పుడు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సెప్టెంబర్ మాసంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్ లో మళ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించారు.

  తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పెరగనున్న గ్రూప్-2, 3, 4 ఖాళీలు.. జీవో విడుదల చేసిన సర్కార్

  ప్రజలకు సీఎం ఏం చెప్పాలనుకుంటున్నారు?

  వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో పూర్తిగా కేంద్రం అసమర్ధతను, లోపాలను ఎత్తిచూపాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశాల ద్వారా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరించనున్నారు.

  అప్పులు తీసుకోకుండా కేంద్రం కుట్రలు..

  తెలంగాణ రాష్ట్రం కార్పొరేషన్ల ద్వారా పరిమితికి మించి అదనంగా అప్పులు చేసిందని వీటిని రాష్ట్ర అప్పుగానే పరిగణిస్తామని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. దీనితో కొత్త అప్పులు పుట్టడం కష్టంగా మారింది. తెలంగాణ పట్ల వివక్షతోనే అప్పులు పుట్టకుండా కేంద్రం చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బడ్జెట్ అంచనాల్లో 30 శాతం కూడా అప్పులు తెచ్చుకోలేకపోయారు. నిధుల సమస్యతో చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. నిన్నటికి నిన్న ఆర్బీఐ నుండి రూ.1000 కోట్లు అప్పు తెచ్చుకున్న అవి నెల, రెండు నెలలకే సరిపోనున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తుంది.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: CM KCR, Hyderabad, Modi, Telangana, Trs

  ఉత్తమ కథలు