హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana | Kcr: ఎన్నికల మూడ్ లో సీఎం కేసీఆర్..వరుస బహిరంగ సభలు దేనికి సంకేతం?

Telangana | Kcr: ఎన్నికల మూడ్ లో సీఎం కేసీఆర్..వరుస బహిరంగ సభలు దేనికి సంకేతం?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

ముందస్తు ఎన్నికలకు వెళ్ళేదే లేదని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్ (Cm Kcr) వడివడిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా కేసీఆర్ (Cm Kcr) తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో కేంద్రంతో సై అంటే సై అంటూనే బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ (Cm Kcr) చూస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinodh Kumar) కూడా రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు వస్తాయన్న వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. మరి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ముందస్తు ఎన్నికలకు వెళ్ళేదే లేదని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్ (Cm Kcr) వడివడిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా కేసీఆర్ (Cm Kcr) తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో కేంద్రంతో సై అంటే సై అంటూనే బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ (Cm Kcr) చూస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinodh Kumar) కూడా రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు వస్తాయన్న వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. మరి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Ts Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం..బీజేపీలోకి మరో ఐదుగురు నాయకులు?

డిసెంబర్ లో వరుస బహిరంగ సభలు..

టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని చేప్పారు. కానీ సీఎం నిర్ణయాలు చూస్తుంటే ఎన్నికలకు వెళ్ళను వెళ్ళను అని చెబుతూనే సడెన్ గా నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తున్నారు. ఓ వైపు టీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా రైడ్స్ జరుగుతుండడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే వాటిని తిప్పికొట్టినట్లు అవుతుందని కేసీఆర్ అనుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 బహిరంగ సభలకు ముహూర్తం ఖరారు చేశారు. డిసెంబర్ 4న మహబూబ్ నగర్ , డిసెంబర్ 7న జగిత్యాలలో ముందుగా బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. జగిత్యాల సభకు ఎమ్మెల్సీ కవితను ఇంఛార్జి బాధ్యతలను కూడా అప్పగించారు.

Warangal: తరాలు మారినా తీరని చేనేతల కష్టాలు!

అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా..

ఇక డిసెంబర్ లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ తరువాత కూడా బహిరంగ సభలను కంటిన్యూ చేయాలనీ చూస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో, కరీంనగర్ లో డిసెంబర్ చివరి వారంలో భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత కూడా అన్ని జిల్లాల్లో సభలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం 2023 డిసెంబర్ వరకు అసెంబ్లీకి గడువు ఉంది. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే 2023 జూన్ వరకు మళ్లీ ఎన్నికలు జరపాల్సి వుంటుంది. అంటే ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ గడువుకు 6 నెలల ముందు వరకు ఎన్నికలు జరపాలి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలను 6 నెలల పాటు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గతం లాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి నుండే వ్యూహాలు అమలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

First published:

Tags: CM KCR, Elections, Telangana, Telangana News

ఉత్తమ కథలు